EG: నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎంహెచ్వీ డా. నరసింహనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు కాకినాడ డీఎంహెచ్వీ కార్యాలయంలో స్వీకరిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు సంబంధిత వెబ్సైట్లో చూడాలన్నారు.