MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న నెల్లికుదురు ఫీల్డ్ అసిస్టెంట్ ఫిడ్స్ తో కింద పడిపోవడంతో గాయాల పాలయ్యాడు. గమనించిన అధికారులు, ఉద్యోగుల సాయంతో 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.