కోనసీమ: ఇవాళ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. కావున ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు నేరుగా తెలపవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.