సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు బండి అంతయ్య గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. బండి అంతయ్య అకాల మృతితో గ్రామంలో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా బీజేపీ నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.