తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...
యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. భారతీయులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ… స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో నేటి గణతంత్ర దినోత్సవం విశిష్టమ...
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం మొత్తం 106 పద్మ అవార్డులు ప్రకటించింది. ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ...
మనమంతా ఒక్కటే.. భారతీయులం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మతాలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నా.. అంతా కలిసి మెలసి ఉంటున్నారని తెలిపారు. అందుకోసమే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విజయం సాధించిందని తెలిపారు. మనమంతా కలిసే ఉంటున్నామని, భారత్ అంటే ఒక జాతి అని పేర్కొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఙాన్, జై...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. కళలు, సాహితీ, విద్య, వైద్యం, సామాజిక సేవ, వాణిజ్యం, వ్యాపారం తదితర విభాగాల్లో కేంద్రం అవార్డులు అందిస్తుంది.ఈ ఏడాది కూడా ...
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్తుండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ఫైలట్ దించారు. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో మార్గం కనిపించలేదు. దీంతో చాపర్‌ను కిందకి దించాల్సి వచ్చింది. తమిళనాడు ఈరోడ్ జిల్లా కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగింది. హెలిక...
కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ… కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాడు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికాడు. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేసిన అనిల్ ఆంటోనీ బీజేపీకి మద్దతుగా పలు వేదికల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేయడం సరికాదని భావించి ఏకంగ...
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. భారత్ లో కూడా పలు సేవలకు ఇబ్బంది తలెత్తింది. ఔట్ లుక్, ఎమ్మెస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాప్ట్ 365 వంటి సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. యూజర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. విషయం తెలియగానే మైక్రోసాఫ్ట్ దర్యాప్తు ప్రారంభించింది. ఎంతమందిపై ఈ ప్రభావం పడింది వెల్లడించవచ్చు. భారత్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ తదితర దేశాల్లో ...
తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంలో వర్మను మించిన వారు లేరు. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని పందుల వాహనం అంటూ ట్వీట్ చేసి మరోసారి ట్వీట్ హీట్ పెంచాడు. వివాదంలోకి స్వామి వివేకానందని కూడా లాగారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం లుంగీ, కండువా కప్పుకున్న పవ...
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా మారాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో సిరాజ్ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి.సిర...
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రప...
రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రధాని మోదీ కానుక అందించారు. దర్గాకు చాదర్ సమర్పించారు. ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు.సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఖ్వాజా మొయినుద్దీన్ ప్రముఖ సూ...
గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ వేడుకలను పురస్కరించుకుని రేపు దేశ వ్యాప్తంగా 901 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తెలిపింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బందిలో గరిష్టంగా 48 గ్యాలంట్రీ అవార్డులు దక్కనున్నాయి. అలాగే మహరాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న 31 మంది, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 25 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు అవార్డులు దక్కించుకున్నారు. అలాగే ఢిల్లీ,...
మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు మిస్ అయ్యారు. కరోనా సమయంలో ఖైదీలు పెరోల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. అందులో చాలా మంది పెరోల్ గడువు ముగిసినా కూడా ఇంకా జైలుకు రాలేదు. ఖైదీలు ఇదే మంచి సమయం అనుకుని పరారయ్యారని సమాచారం. అదృశ్యమైన 451 మంది ఖైదీలలో 357 మంది ఖైదీలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా […]