టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. భారత్ లో కూడా పలు సేవలకు ఇబ్బంది తలెత్తింది. ఔట్ లుక్, ఎమ్మెస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాప్ట్ 365 వంటి సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. యూజర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. విషయం తెలియగానే మైక్రోసాఫ్ట్ దర్యాప్తు ప్రారంభించింది. ఎంతమందిపై ఈ ప్రభావం పడింది వెల్లడించవచ్చు. భారత్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ తదితర దేశాల్లో సమస్య తలెత్తింది. వెబ్ సైట్ రిఫ్రెష్ కావడం లేదని, మెయిల్స్ రావడం లేదని యూజర్లు సోషల్ మీడియా. వేదికగా ఫిర్యాదు చేశారు.
భారతంలో వేలల్లో ఫిర్యాదులు వచ్చాయి. జపాన్ లోను దాదాపు వెయ్యి ఫిర్యాదులు వచ్చాయి. టైమ్స్ నుండి కాల్స్, మెసేజ్ లు చేయలేక పోతున్నట్లు వెల్లడించారు. బిజినెస్, స్కూల్లలో ఎక్కువగా వినియోగించే టైమ్స్ కు ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.