మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు మిస్ అయ్యారు. కరోనా సమయంలో ఖైదీలు పెరోల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. అందులో చాలా మంది పెరోల్ గడువు ముగిసినా కూడా ఇంకా జైలుకు రాలేదు. ఖైదీలు ఇదే మంచి సమయం అనుకుని పరారయ్యారని సమాచారం. అదృశ్యమైన 451 మంది ఖైదీలలో 357 మంది ఖైదీలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కరోనా మహమ్మారి సమయంలో ఏడేళ్లు లేదా అంతకంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలను పెరోల్ పై విడుదల చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో మహారాష్ట్ర జైళ్లలో 35 వేల మంది ఖైదీలున్నారు. మిస్ అయిన ఖైదీల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఖైదీలు ఎక్కడ తలదాచుకున్నారోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.