2014లో తప్పిపోయిన విమానం చుట్టు ఏదో గుండ్రటి వస్తువు తిరిగిందని నెట్టింట్లో వీడియోలు వైరల్ అయ్యాయి. అవి ఏలియన్స్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Flight MH370 is missing. Are there aliens? What did Elon Musk say?
Elon Musk: గ్రహాంతర జీవులు అంటే ఏలియన్స్(Aliens) ఉన్నాయా? లేవా? అనే విషయం ఇప్పటికీ రుజువు కాలేదు కానీ వాటిపై మానవాళికి చాలా ఆసక్తి ఉంటుంది. కొంత మంది శాస్త్రవేత్తలు సైతం ఏలియన్స్ ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు. అప్పుడప్పుడు గుండ్రటి వస్తువులేవో ఆకాశంలో తిరుగుతున్నట్లు నెట్లో కొన్ని వీడియోలు ప్రత్యక్షం అవుతుంటాయి. అలాంటి సమయంలో ప్రపంచమంత ఏలియన్స్‌పై చర్చ జరుగుతుంది. 2014లో ఎంహెచ్370 విమానం తప్పిపోయింది. తాజాగా ఆ విమానం చుట్టు ఏదో గుండ్రటి వస్తువు చక్కర్లు కొట్టిన వీడియో వైరలైంది. దీనిపై చాలా మంది స్పందించారు. ఆ విమానం మాయం కావడానికి ఏలియన్స్ ప్రమేయం ఉందని, అసలు ఏలియన్స్ లేవని ఇలా చర్చసాగుతుండగా.. ఆ వీడియో నిజమైంది కాదని, ఫేక్ అని ఇటీవల సైబర్ నిపుణులు తేల్చారు. అయితే దీనిపై ఓ యూజర్ ఎలన్ మస్క్ అభిప్రాయాన్ని కోరారు.
దీనిపై మస్క్ స్పందించారు. తాను ఏలియెన్స్కు సంబంధించిన ఆధారాలను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చినట్లైతే వెంటనే ఆ వివరాలను పోస్ట్ చేస్తానని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఆయన కంపెనీ స్పేస్ఎక్స్ 6,000 ఉపగ్రహాలు కక్ష్యలో పంపిందని, అయితే అన్ని ఉపగ్రహాలు తిరుగుతున్నా ఇప్పటి వరకు ఏలియెన్స్ కనిపించలేదని మస్క్ పేర్కొన్నారు. ఎంహెచ్370 విమానం 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరింది. అందులో 227 మంది ప్రయాణికులు, 12 మంది స్టాఫ్ ఉన్నారు. విమాన టేకాఫ్ అయిన 38 నిమిషాల తర్వాత సిగ్నల్‌కు దొరకలేదు. రాడార్ల సాహాయంతో ఆ విమానం మాలే ద్వీపం, అండమాన్ సముద్రాన్ని దాటేసి వెళ్లినట్లు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దాని జాడ గుర్తించలేదు. దీనిపై అనేక వాదనలు ఉన్నాయి. అందులో ఏలియన్స్ వాదనలు కూడా ఉన్నాయి.