అమెరికాలోని నెబ్రాస్కాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. 70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన టోర్నడోలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Tornadoes: అమెరికాలోని నెబ్రాస్కాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వాటి దాటికి స్థానికంగా ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నల్లటి దుమ్ము, ధూళితో కూడిన భారీ సుడి గాలులు ఆకాశాన్ని తాకేలా అడ్డువచ్చిన ప్రతి వస్తువును కిందపడేస్తున్నాయి. లింకన్ ఉత్తర ప్రాంతంలోని హైవేపై టోర్నడో చేస్తున్న బీభత్సాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. రహదారి మొత్తం నల్లటి మట్టితో నిండిపోయింది. దాంతో వాహనదారులు తమ కార్లను పక్కకు నిలుపుకోవాల్సి వచ్చింది.
70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన టోర్నడోలు అమెరికా వ్యాప్తంగా చాలా నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతవారణ శాఖ తెలిపింది. అంతే ఈ వేగం పెరిగే అవకాశం ఉందిని సుమారు 200 కిలో మీటర్ల వేగం వరకు పుంజుకునే అవకాశం ఉందని వెల్లడించింది. నెబ్రాస్కాలోని ఒమాహా ప్రాంతం చుట్టుపక్కలే ఎక్కువ టోర్నడోలు వచ్చాయని జాతీయ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో నెబ్రాస్కాలో సుమారు 11 వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా లేదు. అయితే అమెరికాలో టోర్నడోలు సాధారణమే అన్న విషయం తెలిసిందే. అవి ఎప్పుడు వస్తాయో అంచనా వేయడం చాలా కష్టం అని అధికారులు తెలిపారు.