మనమంతా ఒక్కటే.. భారతీయులం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మతాలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నా.. అంతా కలిసి మెలసి ఉంటున్నారని తెలిపారు. అందుకోసమే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విజయం సాధించిందని తెలిపారు. మనమంతా కలిసే ఉంటున్నామని, భారత్ అంటే ఒక జాతి అని పేర్కొన్నారు.
జై జవాన్, జై కిసాన్, జై విజ్ఙాన్, జై అనుసంధాన్ స్ఫూర్తితో దేశం ముందుకు సాగేందుకు రైతులు, కార్మికులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని ద్రౌపది ముర్ము తెలిపారు. దేశ అభివృద్దికి పాటుపడుతున్న ప్రతీ ఒక్క పౌరుడికి అభినందనలు తెలిపారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న జవాన్లు, సరిహద్దు లోపల భద్రత కల్పిస్తోన్న పోలీసులకు ప్రత్యేకంగా అభినందనలను చెప్పారు.
On the eve of the 74th Republic Day, I extend my heartiest greetings to every Indian, at home and abroad. When we celebrate the Republic Day, we celebrate what we have achieved, together, as a nation. pic.twitter.com/EB1koovRUz
గాంధీ నిజంగా మహాత్ముడేనని ద్రౌపది ముర్ము అన్నారు. పారిశ్రామికరణ విపత్తులను ముందే ఊహించాడని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను కూడా గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగ సభ సభ్యులు దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. అందులో మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారని గుర్తుచేశారు. అన్ని అంశాలను విపులంగా పరిశీలించి, రాజ్యాంగంలో చేర్చారని వివరించారు.