గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం మొత్తం 106 పద్మ అవార్డులు ప్రకటించింది. ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు వరించాయి. తెలంగాణకు భారీగా అవార్డులు లభించాయి.
పద్మవిభూషణ్
దిలీప్ కుమార్ (పశ్చిమ బెంగాల్): వైద్య రంగం. మరణానంతరం
పద్మభూషణ్
చినజీయర్ స్వామి (తెలంగాణ): సామాజిక సేవ
కమలేశ్ డి పటేల్ (తెలంగాణ) :
పద్మ శ్రీ
బి.రామకృష్ణారెడ్డి (తెలంగాణ): సాహిత్యం, విద్య
మోదడుగు విజయ్ గుప్తా (తెలంగాణ): శాస్త్ర సాంకేతికం
హనుమంత రావు పసుపులేటి (తెలంగాణ): వైద్యం
సంకురాత్రి చంద్రశేఖర్ (ఆంధ్రప్రదేశ్): సామాజిక సేవ
ఎంఎం కీరవాణి (ఆంధ్రప్రదేశ్): సంగీతం
రతన్ చంద్రాకర్ (అండమాన్ నికోబర్): వైద్య రంగం
మునీశ్వర్ చందర్ ధావర్ (మధ్యప్రదేశ్): వైద్య రంగం
హీరాబాయి లోబి (గుజరాత్): సంఘ సేవకురాలు (గిరిజన)
రామ్ కుయివాంగ్బే న్యుమె (అస్సాం): సామాజిక సేవ (కళలు)
వీపీ అప్పకుట్టన్ పొడువాల్ (కేరళ): సామాజిక సేవ
వడివేల్ గోపాల్, మసి సదయ్యన్ (తమిళనాడు): సామాజిక సేవ
తుల రామ్ ఉప్రెటి (సిక్కిం): వ్యవసాయం
నెక్రమ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్): వ్యవసాయం
జనుమ్ సింగరాయ్ (జార్ఖండ్): సాహిత్యం, విద్య
ధనీరామ్ టోటో (పశ్చిమ బెంగాల్): సాహిత్యం, విద్య
అజయ్ కుమార్ మాండవి (చతీస్ గడ్): కళలు (వుడ్ కార్వింగ్)
రాణి మచ్చయ్య (కర్ణాటక): కళలు (జానపద నృత్యం)
కేసీ రున్రెంసంగి (మిజోరం): కళలు
రిసింగబోర్ కుర్కలాంగ్ (మేఘాలయ): కళలు (జానపద సంగీతం)
మంగళకాంతి రాయ్ (పశ్చిమ బెంగాల్): కళలు (జానపద సంగీతం)
మోవా సుబంగ్ (నాగాలాండ్): కళలు (జానపద సంగీతం)
ముని వెంకటప్ప (కర్ణాటక): కళలు (జానపద సంగీతం)
దోమర్ సింగ్ కున్వార్ (చత్తీస్ గడ్): కళలు (నృత్యం)
పరశురాం కొమాజి ఖునే (మహారాష్ట్ర): కళలు
గులాం మహమ్మద్ జాజ్ (జమ్మూ కశ్మీర్): కళలు (హస్తకళ)
బానుబాయ్ చైతరా (గుజరాత్): కళలు (చిత్రకళ)
పరేశ్ రాథ్వా (గుజరాత్): కళలు (చిత్రకళ)
కపిల్ దేవ్ ప్రసాద్ (బిహార్): కళలు (హస్తకళ)