తెలంగాణ బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్ పాత చింతకాయ పచ్చడే అని అభివర్ణించారు. అబద్దాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు చేశారు. కేసీఆర్ అబద్దాల కోరు అని.. అబద్దాలు విని ప్రజలు విసిగిపోయారని చెప్పారు. మరికొద్దీ రోజుల్లో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడుతుందని చెప్పారు. కేసీఆర్ మోసాలను వినేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరని చెప్పారు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. లీడర్ కావాలంటే ప్రజల్లో భావన రావాలే తప్ప.. డబ్బా కొట్టడం కాదన్నారు.
తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,90,396 లక్షల కోట్లు ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూల ధన వ్యయం రూ.37,525 కోట్లుగా ఉంది. ఈ ఏడాది డిసంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపులు చేశారు. దళిత బంధు, పెన్షన్లు, రుణ మాఫీ, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా లాంటి కీలక పథకాలకు నిధులను అలాట్ చేశారు.