ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్(adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఒక ప్రక్క వర్షం పడుతున్న లెక్క చేయకుండా.. భారీ ఎత్తున ఈ వేడుకలో భాగమయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌కు ఆధ్యాత్మకి గురువు చిన జీయర్ స్వామి(Chinna jeeyar swamy) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడని, ఇలాంటి మంచి మనిషికి మరిన్ని మంచి జరగాలని కోరుకున్నాని అన్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్(adipurush) మూవీ.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్‌కు మరో పది రోజులు కూడా లేదు. దాంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కనీవినీ ఎరుగని విధంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రభాస్, కృతిసనన్, ఓం రౌత్ సహా ఆదిపురుష్ టీం మొత్తం హాజరైంది. చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కి తన ఆశీస్సులు అందించారు. ఇలాంటి గొప్ప సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్న హీరో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్‌ను ప్రశంసించారు.
శ్రీరాముడిని కీర్తిస్తూ శ్లోకంతో చినజీయర్ స్వామి(Chinna jeeyar swamy) తన ప్రసంగం ప్రారంభించారు. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడని.. ప్రభాస్ ఇప్పుడు తనలో ఉన్న రాముడిని బయటికి తీసుకువస్తున్నారని అన్నారు. ‘సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో.. మాలాంటి వారు పాల్గొనడం ఇదే మొదటిసారి. నిజమైన బాహుబలి శ్రీరాముడేనని నిరూపించడం కోసం వచ్చాను. ప్రతి వ్యక్తిలోనూ రాముడున్నాడు. ప్రతి గుండెలోనూ రాముడున్నాడు. శ్రీరాముడు మానవజాతికి ఆదర్శ పురుషుడు. రాముడిని మనుషులు ప్రేమించారు. పశువులు, పక్షులు ప్రేమించాయి. ఋషులు, రాక్షసులు కూడా ప్రేమించారు. ముక్కు చెవులు కోసిన శూర్పణఖ కూడా ప్రేమించింది.
రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడవుల్లో వదిలిన రథం గుర్రాలు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు.. బలవంతంగా తీసుకెళ్లారు. అలాంటి రాముడి చరిత్రని ఈ తరానికి అందించబోతున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్‌లకు అభినందనలు అని అన్నారు. అలాగే.. అరణ్య కాండ, యుద్ధ కాండ ప్రధాన అంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని మీరంతా ఆదరిస్తే లోకం మొత్తం వ్యాపిస్తుందని చినజీయర్ స్వామి అన్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు.