హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా మారాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్లో సిరాజ్ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి.సిరాజ్ 2019 సంవత్సరంలో తన వన్డే అరంగేట్రం చేశాడు. అయితే కొంతకాలం తర్వాత అతను జట్టు నుంచి తొలగించబడ్డాడు. గత ఏడాది ఫిబ్రవరిలో, సిరాజ్ ఈ ఫార్మాట్లో పునరాగమనం చేశాడు. అప్పటి నుండి టీమ్ ఇండియా అత్యంత నమ్మకమైన బౌలర్‌గా నిలిచాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి సిరాజ్ 20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 37 వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో, సిరాజ్ బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బంది పెట్టడం కనిపించింది.