• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

దేశం కోసమే బిఅర్ఎస్: కెసిఆర్, పార్టీలో చేరిన మాజీ సీఎం

దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదన్...

January 28, 2023 / 07:55 AM IST

16 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దిండోషి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఉండే ప్రాంతంలోనే ఉండే యువకుడు ఆమెపై కన్నేశాడు. అదును చూసి తనను గోరెగావ్ లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత తనను మళ్లీ తన ఇంటి వద్ద వదిలేశాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు […]

January 27, 2023 / 09:32 PM IST

డేంజరస్ పాములను విమానంలో తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు

పాములు అంటే మనం చులకనగా చూస్తాం. అవి కనిపిస్తే చంపేస్తాం కానీ.. కొందరు పాములను కావాలని ఇంట్లో పెంచుకుంటారు. పాములతో చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది కానీ.. చాలామందికి తెలియదు. కొన్ని పాములు లక్షలు, కోట్ల వాల్యూ ఉంటాయి. ఉదాహరణకు స్వేత నాగు లాంటి పాముకు ఉండే డిమాండే వేరు. చాలాదేశాల్లో పాములను కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అందుకే వాటికి కూడా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో బ్యా...

January 27, 2023 / 09:16 PM IST

కారు బీభత్సం.. స్కూటీని ఢీకొట్టి అంతటితో ఆగకుండా.. వీడియో

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు నడి రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. రోడ్డు మీద వెళ్తున్న స్కూటీని అతి వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు అంతటితో ఆగకుండా అలాగే వెళ్లింది. అయితే.. స్కూటీని బలంగా కారు ఢీకొనడంతో స్కూటీ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు మీదికి ఎగిరి పడ్డారు. అయినా కూడా డ్రైవర్ కారును ఆపకుండా అలాగే చాలా దూరం కారును తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారును ఆపాడు. [&hel...

January 27, 2023 / 08:47 PM IST

మోదీ డాక్యుమెంటరీపై యూనివర్సిటీలలో రచ్చ.. 144 సెక్షన్.. విద్యార్థుల అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మీద బీబీసీ చానెల్ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకుంటున్నారని విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో తాజాగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎన్ఎస్ యూఐకి చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శ...

January 27, 2023 / 07:24 PM IST

నా ప్రభుత్వాన్నే విమర్శిస్తావా.. మైక్ లాక్కున్న ముఖ్యమంత్రి

ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అధికార పార్టీ వాళ్లు తట్టుకోలేరు. ఎక్కడైనా బహిరంగంగా విమర్శలు చేస్తే ఇక భౌతిక దాడులే. అలాంటిది పక్కన ఉండగానే తన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటారా? లేదు కదా. కర్ణాటకలో అలాంటి సంఘటనే జరిగింది. ఓ స్వామిజీ బెంగళూరులో వరదల గురించి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అడ్డుకున్నారు. స్వామిజీ చేతుల్లో మైక్ లాక్కున్నారు. వివరణ ఇచ్చేందుకు ప్ర...

January 27, 2023 / 06:47 PM IST

విష వ్యర్థాలతో నిండిపోయిన ఇంద్రాయని నది.. బెంబేలెత్తుతున్న పూణె వాసులు.. వీడియో

సాధారణంగా నగరాల్లో ఉండే చెరువులు కానీ.. ఇతర కుంటలు, నదులు గట్రా డ్రైనేజ్ నీళ్లు, ఇతర వ్యర్థాలతో నిండిపోతాయి. చివరకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా అందులోనే కలుస్తుంటాయి. అందుకే.. నగరాల నుంచి ప్రవహిస్తూ వెళ్లే ఏ నీటిని కూడా జనాలు తాగరు. ఖచ్చితంగా అవి నగరాల్లో కలుషితం అవుతాయి. అలా చాలా నగరాల్లో ప్రవహించే నదులు, చెరువులు కలుషితం అయ్యాయి. అయితే.. మహారాష్ట్రలోని పూణె జిల్లా నుంచి ప్రవహిస్తూ వెళ...

January 27, 2023 / 05:46 PM IST

భద్రతా వైఫల్యం.. రాహుల్ జోడో యాత్రకు బ్రేక్

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో యాత్ర కొనసాగుతోంది. అయితే శుక్రవారం అకస్మాత్తుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. భద్రతా వైఫల్యంతో రాహుల్ తన యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో స్థానిక యంత్రాంగం భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. ప్రజలను నియంత్రించడంలో విఫలమవుతున్నారని గుర్తి...

January 27, 2023 / 04:29 PM IST

ఏటీఎం మిషన్ ను ముక్కలు చేసి 38 లక్షలు దోచుకెళ్లారు.. వీడియో

ఈ మధ్య దొంగలు బాగా అప్ డేట్ అయ్యారు. టెక్నాలజీ ఎలా అప్ డేట్ అవుతుందో దొంగలు కూడా అలాగే అప్ డేట్ అవుతూ స్మార్ట్ గా దొంగతనాలు చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. కొందరు దొంగలు కేవలం ఏటీఎం మిషన్లనే టార్గెట్ చేసుకుంటారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నా ముఖానికి ముసుగు వేసుకొని ఏటీఎంలను దోచుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ లో వరుసగా ...

January 27, 2023 / 03:24 PM IST

ప్రతి బాల్ ఫోర్, సిక్స్ కొట్టలేం: ప్రధాని మోదీ

విద్యార్థులు ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని.. అలా రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చిన్నారులకు గెలుపోటములను సమానంగా తీసుకోవడం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థు...

January 27, 2023 / 02:42 PM IST

కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాదయాత్రలో పాల్గోన్నారు. జోడో యాత్ర దేశంలోని పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకేనని ఒమర్ అబ్దుల్లా అన్నారు. దేశ ప్రతిష్ఠ గురించి తాను ఆందోళన చెందుతున్నానని, అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానని అన్నారు. వ్యక్తిగత కీర్తి కోసం తాము ఈ యాత్రలో పాల్గొనడం ...

January 27, 2023 / 01:45 PM IST

బీఆర్ఎస్‌లోకి మాజీ సీఎం? అతని కుమారుడు కూడా

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో మైత్రి ఉండనే ఉంది. ఒడిశాపై కేసీఆర్ దృష్టిసారించారు. ఇటీవల మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, తన కుమారుడు శిశిర్ గమాంత్‌తో కలిసి కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని తెలిసింది. వ...

January 27, 2023 / 02:07 PM IST

ఈపీఎఫ్‌వో షాక్: ఇక వృద్దులకు అధిక పెన్ష నో

పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వారిపై ఇక బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసిన వారిపై ఈ ప్రభావం ఉంటుంది. అధిక వేతనం ఉండి రిటైరయ్యే వారికి పెన్షన్ ఎక్కువే ఉంటుంది. ఆ అధిక పింఛనును ఈపీఎఫ్‌వో రద్దుచేసింది. అందుకు గల కారణాలను వెల్లడించింది. పింఛను పథకం సవరణకు ముందు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తోన్న అధిక పెన్షన్ ఇవ్వరు. 20...

January 27, 2023 / 11:49 AM IST

నేను చస్తే ఎంత? బతికితే ఎంత? కేసీఆర్‌‌పై రాజాసింగ్ ఫైర్

బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తోందని ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. తనకు ఈ వాహనం వద్దు అని చాలా సార్లు లేఖ రాశానని వివరించారు. అయినప్పటికీ అధికారులు వినడం లేదన్నారు. వాహనం వాడకుంటే తనకు నోటీసులు పంపిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటీవల శంషాబాద్ నుంచి వస్తోండగా పురాణాపూర్ సర్కిల్ వద్ద కూడా వెహికిల్ ఆగిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలు అంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని చెప్పారు. రాజాసింగ్ చస్త...

January 27, 2023 / 09:14 AM IST

భారత్‌కు వందకుపైగా చీతాలను అందించనున్న సౌత్ ఆప్రికా

సౌత్ ఆప్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరు...

January 27, 2023 / 09:06 AM IST