dri officials recovered snakes from passengers in bengaluru
పాములు అంటే మనం చులకనగా చూస్తాం. అవి కనిపిస్తే చంపేస్తాం కానీ.. కొందరు పాములను కావాలని ఇంట్లో పెంచుకుంటారు. పాములతో చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది కానీ.. చాలామందికి తెలియదు. కొన్ని పాములు లక్షలు, కోట్ల వాల్యూ ఉంటాయి. ఉదాహరణకు స్వేత నాగు లాంటి పాముకు ఉండే డిమాండే వేరు. చాలాదేశాల్లో పాములను కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అందుకే వాటికి కూడా డిమాండ్ పెరుగుతోంది.
తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చిన పలు రకాల జాతులకు చెందిన పాములను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అందులో 14 పాములు, 4 కోతి జాతికి చెందిన జంతువులు ప్రైమేట్స్ ఉన్నాయి. పాముల్లో కొన్ని విషపూరితమైనవి, కొన్ని కోట్ల విలువైనవి కూడా ఉన్నాయి. వీటిని బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ కు తరలిస్తున్నట్టు అధికారులకు తెలిసింది.
బ్యాంకాక్ నుంచి వీటిని తీసుకొచ్చిన ముగ్గురు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్లలో ఒక మహిళ కూడా ఉంది. వాళ్లు ఫామ్ హౌస్ గురించి చెప్పడంతో.. అధికారులు ఫామ్ హౌస్ పైన రైడ్ చేశారు. అక్కడ అక్రమంగా పెంచుకుంటున్న 48 రకాల జాతులకు చెందిన 139 జంతువులను అధికారులు స్వాధీనం చేసుకొని బెంగళూరులోని బన్నెర్ ఘట్టా బయోలాజికల్ పార్కుకి తరలించారు. ఫామ్ హౌస్ లో అక్రమంగా జంతువులను పెంచుకుంటున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు.
This also led to the recovery of another 139 animals belonging to 48 different species from a farmhouse in Bengaluru. The animals were handed over to Bannerghatta Biological Park, Bengaluru. 4 persons were arrested in connection to this. Further investigation underway: DRI pic.twitter.com/ijl4qOIkmH