• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

క‌రోనా కలకలం.. దేశంలో పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య‌

ప్రపంచంలోని పలు దేశాల్లో కరోన వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భారత్ లో ఆ వైరస్ నియంత్రణలో ఉండడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. దేశంలో కొత్తగా 80 కరోన కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్సపత్రులు హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1,848కు పెరిగిందని వివ‌రించింది. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ లో ఆ వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఉండ‌డం దేశ ప్ర...

January 30, 2023 / 02:49 PM IST

గాంధీకి ప్రధాని మోదీ ఘన నివాళులు

అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ రోజు గాంధీజీ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. దేశం కోసం అమరులైన వారందరికీ కూడా తాను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు. అభివృద్ధి చెం...

January 30, 2023 / 11:06 AM IST

సింగర్ కైలాశ్ ఖేర్‌పై దాడి.. బాటిల్ విసిరిన వ్యక్తి, అరెస్ట్

ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాశ్ ఖేర్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి అతనిపై బాటిల్ విసిరేశాడు. ఈ ఘటన కర్ణాటకలో గల హంపీలో జరిగింది. సంగీత కచేరి నిర్వహిస్తోండగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇంతలో ఒకతను దాడి చేశాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హంపీలో సంగీత ప్రదర్శన ఇస్తుండగా.. కొందరు యువకులు అతి చేశారు. వేదిపై కైలాశ్ ఖేర్ పాటలు పాడుతుండగా.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి యువకులు వాటర్‌ బాటిల...

January 30, 2023 / 02:23 PM IST

ఆల్ పార్టీ మీటింగ్: కో ఆపరేట్ చేయండి.. కేంద్రం రిక్వెస్ట్

బడ్జెట్ సమావేశాలు రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు.. దీంతో బడ్జెట్, సభకు సహాకరించాలని విపక్షాలను కేంద్రం కోరనుంది. అందుకోసం ఈ రోజు (సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. సభ సజావుగా జరిగేందుకు సహాకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంద...

January 30, 2023 / 10:14 AM IST

అది నాపై దాడి కాదు.. భారతదేశంపైనే దాడి: అదానీ

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు తమపై చేసినవి కాదని ఏకంగా భారతదేశం మొత్తంపై చేసిన దాడిగా భారత వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదానీ అభివర్ణించాడు. అది తమ సంస్థపై చేసిన దాడి కాదని భారతదేశం, భారతీయ సంస్థలు, స్వాతంత్య్రం , నాణ్యత, ఆర్థిక వృద్ధిపై దాడిగా పేర్కొంది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టి పారేసింది. తప్పుడు ఆరోపణలని, అవాస్తవాలు, నిరాధారామైనవని పేర్కొంది. ఈ స...

January 30, 2023 / 08:26 AM IST

కేంద్ర మంత్రి వర్గంలో మార్పులకు కసరత్తు.. తెలంగాణ నుంచి మరొకరికి ఛాన్స్?

కేంద్ర మంత్రి వర్గంలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. కీలక రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు..మిత్రులను మంత్రి మండలిలోకి ఆహ్వానించే ఆలోచనతో మోదీ సర్కారు కనిపిస్తోంది. పలు శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే నాలుగు శాఖల మినహా మిగతా శాఖల్లో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. కొందరు మంత్రులు, సహాయ మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని.. ఇప్పటికే వాళ్లకు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు సమాచారం. బడ్జెట్ సమా...

January 30, 2023 / 07:44 AM IST

ఒడిశా మంత్రి నబా దాస్ మృతి..బుల్లెట్ గాయాలతో రక్తస్రావం

ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌ తుదిశ్వాస విడిచారు. ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావమైంది. తొలుత బ్రజ్ రాజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దగ్గర నుంచి ఛాతీపై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారట. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు ...

January 29, 2023 / 08:19 PM IST

ASIకు పిచ్చి.. 8 ఏళ్లుగా ట్రీట్‌మెంట్: భార్య జయంతి దాస్

ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై కాల్పులు జరిపిన ఎఎస్ఐ గోపాల్ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారట. అతని భార్య ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపింది. గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని, మందులు కూడా వాడుతున్నారని పేర్కొంది. ‘ఏం జరిగిందో నాకు తెలియదు. వార్తల్లో చూసి తెలుసుకున్నా. ఘటనా జరిగిన సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. ఈ రోజు ఉదయం నుంచి తాను భర్తతో మాట్లాడలేదని తెలిపింది. ఉదయం తన కూతురు వీడియో కా...

January 29, 2023 / 07:55 PM IST

రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు.. విజయ్ చౌక్ లో బీటింగ్ రీట్రీట్.. వీడియో

రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలోని విజయ్ చౌక్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ముగింపు సందర్భంగా బీటింగ్ రీట్రీట్ ను నిర్వహిస్తున్నారు. మిలిటరీ బ్యాండ్ 29 ఇండియన్ ట్యూన్లను ప్లే చేస్తున్నారు. అలాగే.. 3500 స్వదేశీ డ్రోన్లతో ప్రదర్శన జరగనుంది. భారీగా వర్షం కురుస్తున్నా బీటింగ్ రీట్రీట్ ...

January 29, 2023 / 05:55 PM IST

లాల్ చౌక్ వద్ద జెండా ఎగురవేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు రాహుల్. సోనావార్‌లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి ఘంటా ఘర్...

January 29, 2023 / 05:53 PM IST

విలీనమా.. పొత్తా? కేసీఆర్ తో తమిళ నటుడి డీల్ ఏమిటీ?

భారత రాష్ట్ర సమితిగా పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. తెలంగాణను వదిలి ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సభలు నిర్వహించక ముందే కేసీఆర్ కు ఉత్సాహం నింపేలా హైదరాబాద్ కే ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి చేరుతున్నారు. ఒడిశా నాయకుల చేరికతో కేసీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశాలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేశారు. ఈలోపే ...

January 29, 2023 / 03:16 PM IST

అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని భార్యను చంపి వ్యాపారి ఆత్మహత్య

మధ్యప్రదేశ్ లోని పన్నాలో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యాపారి తన భార్యను చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఇది హత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ఆ వ్యాపారి పలు విషయాల గురించి ప్రస్తావించాడు. ఆ వ్యాపారి పేరు సంజయ్ సేత్. ఆయన భగేశ్వర్ ధామ్ బాబా భక్తుడు. గురూజీ [&he...

January 29, 2023 / 03:08 PM IST

లాయర్ కు షాక్.. కోర్టులో జీన్స్ ప్యాంట్ పై రాద్ధాంతం

న్యాయవాది అంటే ఠక్కున గుర్తుచ్చేది నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, దానిపై నల్ల కోటు. ఇది న్యాయవాదికి ఉండే డ్రెస్ కోడ్. కానీ ఓ న్యాయవాది జీన్స్ వేసుకుని న్యాయస్థానానికి వస్తే అతడికి అనుమతి లభించలేదు. అనుమతి సరికాదా.. అతడిని కోర్టులో వాదనలు వినిపించడానికి కూడా న్యాయమూర్తి అనుమతి ఇవ్వలేదు. వెంటనే అతడిని భద్రతా సిబ్బంది చేత బయటకు పంపించిన ఘటన గువహటి హైకోర్టులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇ...

January 29, 2023 / 02:43 PM IST

ఒడిశా మంత్రి నబా దాస్‌పై ASI కాల్పులు.. పరిస్థితి విషమం

ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఓ ఎఎస్‌ఐ ఛాతిలో కాల్పులు జరిపాడు. వెంటనే మంత్రిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విమానంలో భువనేశ్వర్ తరలించి, అక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు దిగుతున్న సమయంలో ఎఎస్‌ఐ సమీపంలో ఉండి కాల్పులు జరిపాడు. మంత్రిని గురిచేసి ఐదు ర...

January 29, 2023 / 03:08 PM IST

పాకిస్థాన్ లో బ్రిడ్జిపై నుండి పడిన బస్సు, 40 మంది మృతి

పాకిస్థాన్ లో బస్సు అదుపు తప్పి వంతెన మీద నుండి కింద పడడంతో 40 మందికి పైగా మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకున్నది. బెలూచిస్తాన్‌ లోని లస్బెలా ప్రాంతంలో బ్రిడ్జిపై యూటర్న్‌ తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పింది. వంతెన మీద నుంచి కిందకు పడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సు క్వెట్టా నుంది కరాచీ వెళ్తుండగా ప్రమాదానికి గురయింది. ప్రమాదం జరిగిన సమయంలో ...

January 29, 2023 / 02:25 PM IST