ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఓ ఎఎస్ఐ ఛాతిలో కాల్పులు జరిపాడు. వెంటనే మంత్రిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విమానంలో భువనేశ్వర్ తరలించి, అక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు దిగుతున్న సమయంలో ఎఎస్ఐ సమీపంలో ఉండి కాల్పులు జరిపాడు. మంత్రిని గురిచేసి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన ఎఎస్ఐ గోపాల్ దాస్‌గా గుర్తించారు. సొంత రివాల్వర్‌తో కాల్పులు జరిపాడని తెలిసింది. ఎందుకు కాల్పులు జరిపారనే అంశం తెలియరాలేదు.
సెక్యూరిటీ పర్యవేక్షిస్తూనే..
మంత్రి నబా దాస్ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లను గోపాల్ దాస్ పర్యవేక్షిస్తున్నారు. దగ్గరి నుంచి కాల్పులకు తెగబడ్డాడు. దాస్‌ను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నామని బ్రజ్ రాజ్ నగర్ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ బోయ్ తెలిపారు. మంత్రిపై కాల్పులు జరపమని ఎవరైనా ఆదేశించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనికి సంబంధించి సమాచారం తెలియాల్సి ఉందన్నారు.
భద్రతపై ప్రశ్నలు
మంత్రిపై ఓ ఎఎస్ఐ కాల్పులు జరపడంతో భద్రతకు సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యక్రమంలో భద్రతను పర్యవేక్షించే అధికారే ఫైర్ చేయడంతో పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి. కార్యక్రమం కోసం హాజరయ్యేందుకు వచ్చిన మంత్రికి పోలీసు ఎస్కార్ట్ కూడా అందించారు.
గన్ పేలిన శబ్దం
పబ్లిక్ గ్రివెన్స్ కార్యాలయ ప్రారంభానికి నబా దాస్ ముఖ్య అతిథిగా వచ్చారు. స్వాగతం పలికేందుకు జనం గుమిగూడారు. ఒక్కసారిగా గన్ పేల్చిన శబ్దం వినిపించింది. దగ్గరినుంచి గోపాల్ దాస్ కాల్పులు జరిపాడని, వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల ఘటనను ఒడిశా క్రైం బ్రాంచ్ విచారిస్తోంది.
Going by preliminary reports, an assistant sub inspector allegedly shot at health and family welfare minister Naba Kishore Das. The police man who used an issue revolver has been detained
ఎన్నికలకు ముందు హింస
మంత్రిపై కాల్పులు జరపడంతో అధికార బీజేపీ కార్యకర్తలు ఘటనా స్థలంలో ధర్నా చేపట్టారు. ప్రణాళిక ప్రకారమే మంత్రిపై దాడి చేశారని వారు అంటున్నారు. బీజేడీలో నబా దాస్ కీలక నేత. 2024 ఎన్నికల ముందు ఆయనపై కాల్పులు జరపడం ఆందోళన కలిగించే విషయమే అని సీనియర్ జర్నలిస్ట్ ప్రసన్న మొహంతి అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు హింస జరిగిన చరిత్ర ఒడిశా రాజకీయాల్లో ఉందన్నారు. నబా దాస్ జార్సుందాలో కీలకమైన నేత. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని బీజేపీలో చేరారు. అటు నుంచి బీజేడీలో చేరి, నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు.