• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

రిషికేష్‌లో అనుష్క-కోహ్లీ, సాధువులకు భండారా

క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ఆధ్యాత్మిక బ్రేక్ తీసుకున్నారు. రిషికేష్‌లో స్వామి దయానందగిరి ఆశ్రమంలో స్వామీజీని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వీరు ఈ ఆధ్యాత్మిక ట్రిప్‌కు తమ కూతురు వామికను కూడా వెంట బెట్టుకొని వెళ్తుంటారు. ఈసారి మాత్రం పాప కనిపించలేదు. మంగళవారం ఉదయం ఈ జంట ఆశ్రమంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి దయానందగిరి జీ మహారాజ్ ప్రధాని నరేంద్ర మ...

January 31, 2023 / 07:24 PM IST

స్టేజ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన వధువు, వరుడి చిరునవ్వు

మనం సోషల్ మీడియాలో తరుచూ ఫన్నీ, వైరల్ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఇటీవలి ఓ వధువు డ్యాన్స్ చేస్తుండగా, పక్కనే ఉన్న వరుడు చిరునవ్వులు నవ్వుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో గత నెలలో అప్ లోడ్ అయింది. అయితే ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు అరవై లక్షల మందికి పైగా చూడగా, ఒక లక్షా ముప్పై ఆరువేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది షార్ట్ వీడియో. కానీ అందరినీ […]

January 31, 2023 / 05:24 PM IST

చంపుతామంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెదిరింపులు

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోమవారం ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇందుకు సంబంధించిన వ్యక్తిని గుర్తించారు. మనస్థిమితం లేని 38 ఏళ్ల వ్యక్తి ఈ ఫోన్ చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు. అతను అప్పటికే ఢిల్లీలోని గులాబీ బాగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార...

January 31, 2023 / 04:30 PM IST

తారకరత్న సేఫ్‌గా ఉన్నాడు, గిచ్చితే రెస్పాన్స్: బాలకృష్ణ

తన అన్నయ్య తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. నా కొడుకు సేఫ్‌గా ఉన్నాడని, వైద్యులకు పాదాభివందనం అన్నారు బాలయ్య. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తు చేశారు. అతనికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందన్నారు. కానీ అద్భుతం జరిగిందని, మళ్లీ కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. తాము కుప్పం...

January 31, 2023 / 03:25 PM IST

లోకసభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను ఆమె ప్రవేశపెట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన అనంతరం నిర్మలమ్మ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేసారు. కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు రోజు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయసభల ఎదుట ప్రవేశపెట్టడం ఆనవాయితీ....

January 31, 2023 / 02:52 PM IST

మేం రాష్ట్రపతికి కాదు.. ప్రధాని మోడీకి వ్యతిరేకం

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా బహిష్కరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించినట్లు ఆ పార్టీలు తెలిపాయి. అంతే కానీ రాష్ట్రపతికి వ్యతిరేకంగా తాము లేని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవ రావు స్పష్టతనిచ్చారు. ఈ ...

January 31, 2023 / 02:01 PM IST

ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే అద్భుతం : ఆనంద్ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే వేగంగా దూసుకుపోయే జాతీయ రహదారి గురించి ఆయన ప్రస్తావన చేశారు. దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదిగా పేర్కొన్నారు. ఎంతో బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా.. సమాజానికి కూడా కొంత సమయం కేటాయిస్తుంటారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు విషయాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో మందిని ఆలోచింపజేయడం, ప్రోత్సహించడం చేస్తుంటారు‘‘ ఇది భారత దేశ ఆర్థిక...

January 31, 2023 / 12:15 PM IST

ఆత్మవిశ్వాసంతో భారత్.. వచ్చే 25 ఏళ్లు కీలకం: రాష్ట్రపతి

దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని అభిప్రాయ పడ్డారు. ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించుకుందామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం ఇలా కొనసాగింది.. ‘అ...

January 31, 2023 / 12:02 PM IST

బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం మన రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళల గౌరవానికి గర్వకారణమన్నారు. ఐఎంఎఫ్ ఆర్థిక అంచనాల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజా సమస్యలను తగ్గించి సరైన పాలన అందించే దిశగా బడ్జెట్ ...

January 31, 2023 / 11:50 AM IST

విమానంలో మహిళ వికృత చేష్టలు.. బట్టలిప్పి రచ్చరచ్చ

విమాన ప్రయాణంలో ప్రయాణికులు రచ్చరచ్చ చేస్తున్నారు. ముష్టిఘాతాలు, బాహాబాహీకి దిగి బీభత్సం సృష్టిస్తున్నారు. దేశీయంగానే కాక అంతర్జాతీయ విమానాల్లోనూ ఇలాంటి పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానంలో ఓ మహిళ నానా రభస చేసింది. సిబ్బందిపై దాడి చేయడమే కాక విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ వికృత చేష్టలకు పాల్పడింది. తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు...

January 31, 2023 / 11:44 AM IST

వివేక హత్య కేసులో సీబీఐ చేతికి కీలక ఆధారాలు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక తీగా దొరికినట్లుగా తెలుస్తుంది. అది తాడేపల్లికి కనెక్ట్ అయినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. వీటి ఆధారంగా కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున...

January 31, 2023 / 08:42 AM IST

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచ...

January 31, 2023 / 08:19 AM IST

ప్రత్యేక విమానం సరే హోదా ఏది: జగన్ కు లోకేష్

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానాలలో పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా మాత్రం తేవడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు వస్తానని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా హోదా మాట లేదని మండిపడ్డా...

January 31, 2023 / 08:05 AM IST

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం : బీఆర్ఎస్ నేత కేశవరావు

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్, ‘ఆప్’ నిర్ణయించినట్టు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తెలిపారు.  ఢిల్లీలో నిన్న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని, ఇందుకు నిరసనగా రాష్ట్...

January 31, 2023 / 07:33 AM IST

అదానీ ఆ పేరుతో తప్పించుకోలేరు: హిండెన్ బర్గ్

అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణ పైన అదానీ గ్రూప్ ఇటీవల స్పందించింది. అమెరికా సంస్థ ఆరోపణలను కొట్టి పారేసింది. దేశీయ సంస్థలపై కావాలని ఈ రీసెర్చ్ సంస్థ బురద జల్లుతోందని 413 పేజీల వివరణ ఇచ్చింది. దీనిపై తిరిగి హిండెన్ బర్గ్ కౌంటర్ ఇచ్చింది. చేసిన తప్పులను జాతీయవాదం ముసుగులో కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయవద్దని పేర్కొన్నది. తాము చేసిన కీలక ఆరోపణలపై నిర్ధిష్ట సమాధానం ఇవ్వలేదని పేర్కొన్న...

February 9, 2023 / 12:17 PM IST