అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ రోజు గాంధీజీ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. దేశం కోసం అమరులైన వారందరికీ కూడా తాను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పని చేయాలనే తమ సంకల్పాన్ని బలోపేతం చేస్తూనే ఉంటాయని ట్వీట్ లో పేర్కొన్నారు. స్వదేశీ, స్వావలంబన మార్గాన్ని అనుసరించి దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి మనల్ని ప్రేరేపించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు మిలియన్ల నమస్కారాలు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర స్వర్ణయుగంలో స్వచ్ఛత, స్వదేశీ, స్వభాష ఆలోచనలను అవలంబించడమే గాంధీజీకి నిజమైన నివాళి అని కొనియాడారు.