బడ్జెట్ సమావేశాలు రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. మోడీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు.. దీంతో బడ్జెట్, సభకు సహాకరించాలని విపక్షాలను కేంద్రం కోరనుంది. అందుకోసం ఈ రోజు (సోమవారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది.
సభ సజావుగా జరిగేందుకు సహాకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. బడ్జెట్ సెషన్, సభకు కో ఆపరేషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తోంది. రేపు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. బుధవారం లోక్ సభలో 2023-24 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడతారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలపై విపక్షాలు కలిసి పోరాడుతామని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు. విపక్షాల మధ్య విభేదాలు ఉండొచ్చు..బీజేపీపై కలిసి పోరాడేందుకు ఒక్కటవుతామని తెలిపారు. భారత్ జోడో యాత్ర ముగింపునకు ఒకరోజు ముందు ఈ కామెంట్స్ చేశారు. చైనా లడాఖ్ సరిహద్దు గుండా 2 వేల చదరపు అడుగుల భూభాగం ఆక్రమించిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయనుంది.