దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దిండోషి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఉండే ప్రాంతంలోనే ఉండే యువకుడు ఆమెపై కన్నేశాడు. అదును చూసి తనను గోరెగావ్ లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత తనను మళ్లీ తన ఇంటి వద్ద వదిలేశాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ 372(2)(ఎన్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.