కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ మీద బీబీసీ చానెల్ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకుంటున్నారని విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో తాజాగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎన్ఎస్ యూఐకి చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించగా వారిని యూనివర్సిటీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం క్యాంపస్ లో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
దీంతో విద్యార్థులంతా కలిసి యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వాళ్లకు మద్దతుగా భారీగా విద్యార్థులు తరలి రావడంతో అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు.కొందరు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ డాక్యుమెంటరీ గొడవ కాస్త కోల్ కతాకు పాకింది. ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి చెందిన ఎస్ఎఫ్ఐ మెంబర్స్ యూనివర్సిటీలో నిరసనకు దిగారు. బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అధికారులు అడ్డుకున్నారని, వర్సిటీలో పవర్ ను కట్ చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనతో క్యాంపస్ లో కరెంట్ సరఫరాను పునరుద్ధరించడంతో మళ్లీ బీబీసీ డాక్యుమెంటరీని విద్యార్థులు స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించారు. మొదటి పార్ట్ పూర్తవగానే దాన్ని ప్రదర్శించకుండా ఆపేశారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
West Bengal | Members of SFI (Students' Federation of India) raised slogans at Presidency University in Kolkata earlier this evening, following a power cut as they planned the screening of banned BBC documentary PM Modi.