పెన్షనర్లకు ఈపీఎఫ్వో షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వారిపై ఇక బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసిన వారిపై ఈ ప్రభావం ఉంటుంది. అధిక వేతనం ఉండి రిటైరయ్యే వారికి పెన్షన్ ఎక్కువే ఉంటుంది. ఆ అధిక పింఛనును ఈపీఎఫ్వో రద్దుచేసింది. అందుకు గల కారణాలను వెల్లడించింది. పింఛను పథకం సవరణకు ముందు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తోన్న అధిక పెన్షన్ ఇవ్వరు. 2023 జనవరి నుంచి అధిక పింఛను నిలిపివేస్తామని స్పష్టంచేసింది. ఈపీఎఫ్వో నిర్ణయించిన గరిష్ఠ వేతన పరిమితి ₹5,000/₹6,500పై సవరణ పింఛను నిర్ణయించి ఇస్తామని చెబుతోంది. దీంతో అధిక పెన్షన్ పొందేవారికి నష్టం కలుగనుంది.