సౌత్ ఆప్రికా నుంచి భారత్కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు దక్షిణాఫ్రికా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దక్షిణాసియా దేశం నుంచి చిరుతలను తిరిగి భారత్కు తీసుకురావాలనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. భారతదేశం ఒకప్పుడు ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది. 1952 నాటికి చిరుతల సంఖ్య పూర్తిగా క్షీణించిపోయింది. అయితే, ఇలాజరగడానికి ప్రధాన కారణం చిరుతలను వేటాడటం. స్మగ్లర్లు చిరుతలను వేటాడి వాటి చర్మాన్ని అక్రమ రవాణా చేసేవారు. కాలక్రమంలో స్మగ్లర్ల భారినపడి రక్షణ లేకపోవటంతో చిరుతల సంఖ్య పూర్తిగా అంతరించిపోయిందన్న వాదన ఉంది