సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ ఇంటిపేరుపై రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. సూరత్ కోర్టు(Court of Surat) ఈ కేసు విచారణ జరిపి.. ఇటీవల రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. తీర్పుపై పైకోర్టుకు వెళ్లేందుకు ఒక నెల గడువు ఇచ్చింది. శిక్ష పడటంతో లోక్‌సభ (Lok Sabha)సెక్రెటేరియట్ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసింది.
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని నోటీసుల్లో పేర్కొంది సీబీఐ (CBI). ఇప్పటికే ఈ కేసులో దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. పలువురిని ఈడీ విచారించింది.
బైశాఖీ (Baisakhi ) ఉత్సవాల్లో భాగంగా బేణీ సంగమం ప్రాంతంలో బెయిన్ గ్రామంలోని చెనానీలో ఈ ఘటన చోటుచేసుకుంది.బైశాఖీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు (devotees) పాదచారుల వంతెనపైకి ఒక్కసారిగా రావడంతో అది కుప్పకూలినట్లు తెలిపారు.
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ చావడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam) సంప్రదాయ నృత్యమైన (Traditional Dance) బిహూ డ్యాన్స్ (Bihu Dance) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness Book Of World Records) స్థానం సాధించింది. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాస్టర్ ట్రైనర్లు, డ్యాన్సర్లతోసహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి రూ.2...
రాబోయే దశాబ్దంలో COVID-19 వంటి(similar pandemic) ప్రాణాంతక మహమ్మారి సంభవించే అవకాశం 27.5 శాతం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. వైరస్‌లు తరచుగా పుట్టుకొస్తున్నందున ఇది జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.
భారత ప్రభుత్వం, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పన్నెండువేల వెబ్ సైట్లను ఇండోనేషియా హ్యాకింగ్ గ్రూప్ టార్గెట్ చేసినట్లు కేంద్రం గుర్తించి, హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.