India reports 11,109 new Covid cases in last 24 hours
Coronavirus:కరోనా వైరస్ (Coronavirus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 11 వేలకు పైగా కేసులు వచ్చాయి. 11,109 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ (union health ministry) తెలిపింది. గత 7 నెలల్లో ఇది అత్యధికం అని వివరించింది. నిన్న 2,21,725 పరీక్షలు చేయగా.. కొత్త కేసులు బయటపడ్డాయి. కొత్త కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 49622కి చేరింది.
ఒమైక్రాన్ సబ్ వేరియంట్ అంత ప్రమాదకరం కాకున్నా.. కేసుల (cases) సంఖ్య మాత్రం పెరుగుతోంది. అందుకే ప్రీకాషన్స్ తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. విధిగా మాస్క్ (mask) ధరించాలని.. తరచూ హ్యాండ్ వాష్ (hand wash) చేసుకోవాలని కోరుతుంది.
రెండేళ్ల క్రితం కూడా ఇలానే వేసవిలో కరోనా వైరస్ అల్లాడించింది. అప్పుడు సీరియస్ తీసుకొని వారంతా ప్రాణాలను కోల్పోయారు. తర్వాత థర్డ్ వేవ్ వచ్చినా.. అప్పటికే మెజార్టీ పీపుల్ వ్యాక్సిన్ తీసుకోవడంతో అంతగా ఇంపాక్ట్ చూపించలేదు.