ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్‌కు సంబంధించి లేఖ విడుదల చేయగా.. ఇప్పుడు మరో లేఖ బయటకు వచ్చింది.
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాచడం మొదలుపెట్టింది. ఈ ఏడాది మే నెలలో మరింత గరిష్టంగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీ మారినందుకు గిరిజన మహిళల్ని గ్రామంలో కిలోమీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ అసెంబ్లీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు తాను తర్వాతి స్థానంలో ఉంటానని తెలుసని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. మరోవైపు అబద్ధ సాక్ష్యాలు, కోర్టులలో తప్పుడు సాక్ష్యాలను అందించినందుకు తాను సీబీఐ, ఈడి అధికారులపై కేసులు నమోదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
పెళ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్రగాయాలతో అక్కడే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు.
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు.ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.
వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న అసెంబ్లీని సినిమా థియేటర్ లా భావిస్తున్నారు. పళని స్వామి నా అపాయింట్ మెంట్ కోరితే తప్పనిసరిగా ఇస్తా అని శశికళ తెలిపారు. మళ్లీ ఏఐడీఎంకేను ఒక్కటి చేయాలని శశికళ భావిస్తున్నది.
పూణె(Pune)లోని పింపుల్ గురవ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు (BUS) లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు.
సంస్థకు అవసరమైన మూలధన సమీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అత్యుత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు అదే చేస్తోంది.
అమర్‌నాథ్ ఆలయ యాత్ర(Amarnath Yatra) జులై 1వ తేదీ నుంచి ప్రారంభమై 62 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మోడ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
సురేంద్ర బీజేపీ కిసాన్ మోర్చా నజఫ్‌గఢ్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సురేంద్ర మతియాల తన కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చున్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆకస్మాత్తుగా కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరిపారు.