»Five Dead 12 Critical After Consuming Spurious Liquor In Bihar
Adulterated Liquor: బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు.ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.
Adulterated Liquor:మద్యపాన నిషేదం ఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం(Adulterated Liquor) తాగి 20 మంది మరణించారు. ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. బీహార్(Bihar)లోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం తాగి మరో 12 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై బీహార్ పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్లో కల్తీ మద్యం సేవించి 75 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే రాష్ట్రంలోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మరో 12 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి(Hospital) పాలయ్యారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని మోతీహరి(Motihari) జిల్లాలోని లక్ష్మీపూర్(Laxmipur) గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. మరో 12 మంది కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కల్తీ మద్యం సేవించినందు వల్లనే వీరంతా చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటి వరకు ఈ మరణాలు కల్తీ మద్యం సేవించడం వల్లనే సంభవించాయన్న విషయాన్ని ధృవీకరించలేదు. పోస్టుమార్టం(Postmartum) నివేదిక వచ్చిన తరువాత ఈ మరణాలకు గల కారణం ఏంటనే విషయం అనేది చెబుతామని అధికారులు పేర్కొంటున్నారు.