Coronavirus:దేశంలో మళ్లీ కరోనా వైరస్ (Coronavirus) కేసులు పెరుగుతున్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి 10 వేలకు తక్కువ కేసులు రావడం లేదు. మాస్క్ (mask) ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. రాష్ట్రాలు కూడా మాస్క్ (mask) మ్యాండెటరీ (mandatory) చేశాయి. అయినప్పటికీ కేసుల పెరుగుదల మాత్రం తగ్గడం లేదు.
గత 24 గంటల్లో కొత్తగా 10,753 కరోనా కేసులు వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కు చేరింది. వైరస్ సోకిన 27 మంది చనిపోయారు. కరోనా డైలీ పాజిటివిటీ రేటు 6.78గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 4.49గా ఉంది.
ఒమైక్రాన్ (omicron) సబ్ వేరియంట్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వేగంగా వైరస్ (virus) వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. నిన్న దేశంలో 11,109 కరోనా కేసులు వచ్చాయి. ఇదీ 7 నెలల్లో అత్యధిక కేసులు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.