»Karnataka Ex Deputy Cm Laxman Savadi Joined Congress
Congressలో చేరిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ చావడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Karnataka ex-deputy CM Laxman Savadi joined Congress
Laxman Savadi joins Congress:కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ చావడి (Laxman Savadi) కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ (bjp) టికెట్ నిరాకరించడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో (congress) చేరారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (dk shivakumar) తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా తమ పార్టీలో చేర్చుకున్నామని వివరించారు.
లక్ష్మణ్ (laxman) అథాని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. దానిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కీలక నేతలకు తమ పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని డీకే శివకుమార్ తెలిపారు. మరో 9, 10 మంది ఎమ్మెల్యేలు (mla) కూడా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వివరించారు. సీట్ల కేటాయింపు ప్రక్రియలో ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. లక్ష్మణ్ (laxman) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిల్ పదవీకి బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనకు ఆత్మాభిమానం ఎక్కువ అని.. సీటు కోసం అడిగే పరిస్థితి ఉండదన్నారు. ఎవరీ ముందు తాను నటించాల్సిన అవసరం లేదని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు (sitting mla) టికెట్ ఇవ్వలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని.. పక్కనపెట్టింది. అసంతృప్తితో ఉన్న నేతలు బయటకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో కూడా 52 మంది కొత్తవారికి అవకాశం కల్పించలేదు. లక్ష్మణ్ చావడి కాక ఎమ్మెల్సీ ఆర్ శంకర్, ఎమ్మెల్యేలు ఎంపీ కుమారస్వామి, గూలిహట్టి శేఖర్..ఇతరులకు టికెట్ దక్కలేదు.
అంతకుముందు సీఎం బొమ్మైపై (bommai) లక్ష్మణ్ (laxman) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతనిని పార్టీలోకి తీసుకొచ్చింది తనేనని వివరించారు. యడియూరప్ప వద్దకు తీసుకెళ్లానని.. పార్టీలో చేర్పించానని చెప్పారు. అలా ఎమ్మెల్యే, మంత్రి.. చివరకు సీఎం పదవీ చేపట్టారని వివరించారు. తర్వాత తమనే పక్కనపెట్టారని మండిపడ్డారు.