కుటుంబంలో ఆస్తికి సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లే ముందు రోజు ఆదివారం కుమారుడితో గొడవ జరిగిందని సమాచారం.
ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడి హత్య కేసును యూపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాఫ్తు కోసం పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు.
ముంబై (Mumbai) తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని ఢిల్లీలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్ (Apple's retail store) ను సంస్థ లాంచ్ చేయనుంది. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ దిగ్గజం ఇప్పటికే వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ (Deendayal Upadhyay) పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’, ‘నానాజీ దేశ్‌ముఖ్(Nanaji Deshmukh) సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్(Vigyan Bhavan) లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
హైదరాబాద్ (Hyderabad) మహిళకి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. మన కరెన్సీలో రూ.100 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌పై రూ2.2 కోట్లు గెలుచుకుంది. అబుదాబిలో నివసిస్తుంది.. మూడేళ్ళుగా మెడికల్ కోడర్(Medical coder) గా పని చేస్తుంది లాటరీ రూపంలో అదృష్టం వరించింది.అదృష్టం పరీక్షించుకోవటానికి జస్ట్ 100 రూపాయలు ఖర్చు పెడితే.. రెండు కోట్లు ఇంటికి రావటం అంటే అదృష్టమే
2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) అర్థాంతరంగా ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమర్‌నాథ్ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
మొహంపై జాతీయ పతాకం పెయింటింగ్ వేసుకున్న బాలికను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రబంధక్ కమిటీ క్షమాపణ చెప్పింది.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.