»Three Member Sit To Probe Killing Of Atiq Brother
Atiq Ahmed murder: దర్యాఫ్తు ముమ్మరం, సిట్ ఏర్పాటు
ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడి హత్య కేసును యూపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాఫ్తు కోసం పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు.
ఉత్తర ప్రదేశ్ లో (uttar pradesh) ఎంతోమందిని వణికించిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (atiq ahmed killing), అతని సోదరుడు అష్రాఫ్ ల హత్య పైన ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపారు (Three member SIT to probe killing of Atiq, brother). సాక్షుల స్టేట్ మెంట్ రికార్డ్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల సేకరణ, రికార్డ్స్ సమీకరణ, సైంటిఫిక్, పోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పరీక్షల వంటి వాటిలో నిష్పాక్షిక విచారణకు ఈ సిట్ ను (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు శాంతిభద్రతల విభాగం ప్రత్యేక డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. సిట్ చీఫ్ గా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సతీష్ ను నియమించారు. సబ్యులుగా అడిషనల్ పోలీస్ కమిషనర్ సత్యేంద్ర ప్రసాద్, క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ ఓం ప్రకాశ్ లను నియమించారు. ఈ దర్యాఫ్తు పర్యవేక్షణ కోసం ప్రయాగ్ రాజ్ ఏడీజీ, పోలీస్ కమిషనర్ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్లతో ముగ్గురు సభ్యుల కమిటీని వేసినట్లు యూపీ డీజీపీ విశ్వకర్మ తెలిపారు. ఇంతకుముందే ముగ్గురు సభ్యులతో జ్యూడిషియల్ కమిషన్ ని (judicial commission) సీఎం యోగి ఆదిత్యనాథ్ నియమించారు (CM Yogi Adityanath). ఈ కమిషన్ కూడా నివేదికను అందించనుంది.
నిందితులు లవ్లేష్, అరుణ్, సన్నీలను ప్రయాగ్ రాజ్ సెంట్రల్ జైలు నుండి ప్రతాప్ గఢ్ డిస్ట్రిక్ట్ జైలుకు తరలించారు. పరిపాలనాపరమైన కారణాలతో తరలించినట్లు చెబుతున్నారు. అయితే అతీక్ తనయుడు అలీ ప్రయాగ్ రాజ్ జైల్లోనే ఉండటంతో మార్చినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు, అతీక్ అహ్మద్ తలకు ఒక బుల్లెట్, ఛాతి, శరీరం వెనుక భాగంలో కలిపి 8 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అష్రాఫ్ శరీరం నుండి 5 బుల్లెట్లను డాక్టర్లు తీశారు.
ఇదిలా ఉండగా, అతిక్ కుటుంబం అతని హత్య లోతైన రాజకీయ కుట్ర అని భావిస్తోంది. అతిక్ అహ్మద్ తరపు న్యాయవాది విజయ్ పోలీసుల భద్రత లోపాన్ని తీవ్రంగా ఖండించారు.