»Good News For Devotees Amarnath Yatra Dates Are Finalised
Amarnath Yatra : భక్తులకు శుభవార్త.. అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారు
2019లో జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) అర్థాంతరంగా ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమర్నాథ్ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాల్లో అమర్నాథ్ (Amarnath) ఒకటి. హిమాలయాల్లో కొలువుదీరే ఈ మంచు లింగాన్ని దర్మించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు (devotees) తరిలి వెళ్తుంటారు. సమ్మర్లో తప్ప మిగతా సమయంలో ఇక్కడ మంచు కప్పడి ఉంటుంది. దీంతో వేసవిలో కొన్ని రోజులు మాత్రమే ఇక్కడి మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.ఈ క్రమంలో పరమేశ్వరుడి (Parameshwar) భక్తుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)కు సంబంధించిన తేదీలను అధికారులు ప్రకటించారు. అమర్నాథ్ పుణ్య క్షేత్ర యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ (Registration) ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.
వచ్చే జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగే ఈ యాత్ర కోసం అధికారులు రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. అమర్ నాథ్‌కు ఉన్న రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం అవుతుందని, అనంత్ నాగ్ జిల్లా(Anantnag District) పహాల్గాం మార్గం, గంగదేర్ బల్ జిల్లా బల్తాల్ మార్గాల్లో ఎదో ఒక దాన్ని యాత్రికులు ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా భక్తులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పంజాబ్ నేషనల్, ఎస్ బీఐ, జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir), ఎస్ బ్యాంక్‌లలోని 542 బ్రాంచ్‌లలో ఆఫ్ లైన్ రిజిస్టేషన్ సదుపాయం ఉంది. కాగా, యాత్రులకు ఆరోగ్య ధృవీకరణ పత్రం(Health certificate) తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆరు వారాలు లేదా అంతకంటే ఎక్కువ గర్భం కలిగిన స్త్రీలను ఈ యాత్రకు అనుమతించరు.