»Terrorists Attack Army Vehicles In Jammu And Kashmirs Kathua
Terrorists attack: జమ్మూకశ్మీర్లోని కథువాలో ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి
జమ్మూకశ్వీర్లోని కథువా జిల్లాలో మరో ఉగ్రదాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. గ్రానైడ్లు విసిరారు. వరుస ఉగ్రదాడులు ఆయా ప్రాంత వాసులని కలువర పెడతున్నాయి.
Terrorists attack army vehicles in Jammu and Kashmir's Kathua
Terrorists attack: జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రదాడి చోటుచేసుకుంది. కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలో సోమావారం ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనాలపై కొండపై ఉన్న టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. గ్రానైడ్లు కూడా విసిరారు. అప్పటికే అప్రమత్తం అయిన జవాన్లు చాకచక్యంగా తప్పించుకున్నారు. దాంతో ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం… ఉగ్రవాదులుబిల్లావర్ ప్రాంతంలోని కొండప్రాంతంలో రెక్కీ చేసినట్లు చెప్పారు. ఈ దాడుల అనంతరం ఆ ప్రాంతాన్ని సైనికులు తీవ్రంగా పరిశీలించారు. అనుమానిత ప్రాంతంలో కార్టన్ సెర్చ్ చేశారు. ఈ ఆపరేషన్లో ఎవరు పట్టుబడలేదు.
అయితే కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద దాడులు పెరిగిపోయాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో దోడా జిల్లాలో జంట ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. అలాగే జూన్ 11న, చత్తర్గల్లా వద్ద జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు, జూన్ 12న గండో ప్రాంతంలోని కోటపైన జరిగిన ఉగ్రదాడిలో ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. దీంతో భద్రతా బలగాలు యాంటీ-టెర్రరిస్ట్ యాక్టివిటీని వేగవంతం చేసింది. ఆయా జిల్లాలో నలుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు చోరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. దాంతో వాళ్లను పట్టించిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.
జూన్ 26న జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11, 12 తేదీలలో కొండ జిల్లాలో జరిగిన జంట ఉగ్రవాద దాడుల తరువాత ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తో పాటు పోలీసులు కార్డన్ ఆపరేషన్ జరిపిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో కూడా ఉగ్రవాదులు హతమయినట్లు అధికారులు చెప్పారు. తాజాగా కథువా జిల్లాలో మరో ఉగ్రదాడి జరిగింది.