ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.
అంబానీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరారు. అనంత్ అంబానీతో రాధికకు నిశ్చితార్థం ఎప్పుడో జరిగింది. వీరిది ప్రేమ వివాహం అనే విషయం మీకు తెలుసా? మరి వీరి ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం.
ఇద్దరు కూతుళ్లను తల్లితండ్రులే(parents) హత్య(murder) చేసిన ఓ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వారిని హత్య చేయడాన్ని పలువురు సపోర్ట్ చేస్తుండగా..మరికొంత మంది మాత్రం తప్పని చెబుతున్నారు. అసలు వారి కుమార్తెలు ఏం చేశారు? ఎందుకు వారిని పేరెంట్స్ చంపేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా సమర్పించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీస్ డ్యాన్సింగ్ టాలెంట్ జనాల్సి ఆకట్టుకుంటోంది. ముంబయికి (mumbai) చెందిన అమోల్ కాంబ్లీ (amolkamble) తన డ్యాన్స్ అదరగొడుతున్నారు. అంతకు ముందు ఆయన రణ్‌వీర్‌సింగ్ (Ranveer Singh)పక్కన వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వర్కవుట్ చేస్తూ వేసిన స్టెప్పుల్ని రాఘవ్ అనే ఇన్‌స్టా (Insta) యూజర్ షేర్ చేయడంతో మరోసారి వైరల్ అయ్యారు
ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శుక్రవారం ప్రియురాలి పుట్టిన రోజును (birthday) ఘనంగా చేశాడు, ఆపై కేకు కోసిన కత్తితోనే ఆమె గొంతుకోశాడు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్ (Police station) కు వెళ్లి లొంగిపోయాడు. వాట్సాప్ లో చాట్ చేస్తుండడం చూసి ఎవరితో చాట్ చేస్తున్నావని అడిగితే చెప్పకపోవడం, చాటింగ్ చూపించేందుకు నిరాకరించడంతో కోపం పట్టలేక చంపేసినట్లు...
అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్యతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది. అల్లర్లు ఏర్పడే ప్రమాదం ఉన్నట్టు భావించిన అధికారులు అన్ని జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. సున్నితమైన ప్రాంతాలకు పెట్రోలింగ్‌లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం నివాసానికి భద్రత పెంచారు.
గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్(Atiq Ahmed) దారుణ హత్యకు గురయ్యాడు. జైలు(Jail) నుంచి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు అతీఖ్ అహ్మద్‌ని ప్రయాగ్‌రాజ్ తీసుకెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు.
లిక్కర్ స్కామ్ కేసు(liquor scam case)లో విచారణకు ఉదయం 11 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ ఆఫీసు ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) అరెస్టై జైల్లో ఉన్నారు
తాజాగా జరిగిన 59వ ఫెమీనా మిస్ ఇండియా (Femina Miss India) పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన బ్యూటీస్ పోటీపడ్డారు. వీరు తమ అందంతోనే కాదు, తెలివితోనూ కూడా జడ్డిల ప్రశంసలు అందుకున్నారు. బాగా ఇంప్రెస్ చేసిన 19 ఏళ్ల నందిని గుప్త (Nandini Gupta) మిస్ ఇండియా కిరిటీన్నా ఎగేరసుకుపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 40 మందితో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ గర్రా నది వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇరవై మంది మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి.