Arvind Kejriwal : సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
లిక్కర్ స్కామ్ కేసు(liquor scam case)లో విచారణకు ఉదయం 11 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ ఆఫీసు ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) అరెస్టై జైల్లో ఉన్నారు
Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసు(liquor scam case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Cm Arvind Kejriwal)కు విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ (CBI) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి ప్రశ్నించేందుకు ఉదయం 11 గంటలకు ఆయన ఢిల్లీలోని సీబీఐ ఆఫీసు ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా నేడు సీబీఐ విచారణకు కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) అరెస్టై జైల్లో ఉన్నారు.. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీబీఐ విచారణ ఎదుట విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. మరోవైపు ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నట్టు సీబీఐ చెబుతోంది.
తాను అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీపరుడు ఎవరూ ఉండరని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ(PM Modi), కేంద్రప్రభుత్వంపై ఆయన అసహనం వ్యక్తంచేశాడు. ఢిల్లీ అసెంబ్లీ(Assembly)లో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు నుంచి సీబీఐ, ఈడీకి సమన్లు పంపే వరుసలో తాను ఖచ్చితంగా ఉంటానని తనకు తెలుసునని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసు(liquor scam case)లో కేంద్ర ఏజెన్సీలు తమపై కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయని అరెస్టు చేసిన వ్యక్తులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సీబీఐ విచారణకు హాజరుకావడం.