»Parents Who Killed Their Two Daughters For Love At Bihar Hajipur
Parents Killed: లవ్ చేశారని ఇద్దరు కుమార్తెలను చంపిన పేరెంట్స్
ఇద్దరు కూతుళ్లను తల్లితండ్రులే(parents) హత్య(murder) చేసిన ఓ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వారిని హత్య చేయడాన్ని పలువురు సపోర్ట్ చేస్తుండగా..మరికొంత మంది మాత్రం తప్పని చెబుతున్నారు. అసలు వారి కుమార్తెలు ఏం చేశారు? ఎందుకు వారిని పేరెంట్స్ చంపేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎందుకు కలుగుతుందో అస్సలు చెప్పలేం. యుక్త వయస్సుకు వచ్చిన అనేక మంది యువతీ యువకులు ప్రేమ(love) పట్ల ఆకర్షితులు అవుతారు. అయితే తమ పిల్లలు మాత్రం ఎవరినైనా ప్రేమిస్తే కొంతమంది తల్లిదండ్రులు సున్నితంగా వ్యవహిస్తారు. మరికొంత మంది మాత్రం చాలా కఠినంగా ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రేమ విషయంలో పేరెంట్స్ ఏకంగా ఇద్దరు కుమార్తెల గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని హాజీపూర్‌లో(bihar hajipur) చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనలో ఆ కుమార్తెల తండ్రి(father) పారిపోగా, తల్లి(mother)ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నేరాన్ని అంగీకరించింది. ఆ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి కుటుంబంలోని ఇద్దరు అమ్మాయిలు వేరే కులానికి చెందిన వారిని ప్రేమించారని తల్లి విలపిస్తూ చెప్పింది. వారికి వద్దని ఎన్ని సార్లు చెప్పినా కూడా వారి తీరు మారలేదని వెల్లడించింది. ఆ క్రమంలో తన కూతుళ్లిద్దరూ మళ్లీ మళ్లీ ఇంటి నుంచి పారిపోయేవారని సమాజంలో తమ పరువు పోయేదని ఆమె వాపోయింది. దీంతో విసిగిపోయి ఇద్దరినీ గొంతుకోసి ఆమె భర్త హత్య చేసినట్లు వెల్లడించింది. అయితే తండ్రే బాలికలను హత్య చేశారని మొదట తల్లి చెప్పింది. కానీ విచారణలో తల్లిదండ్రులిద్దరూ(parents) కలిసి బాలికలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు(police) ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం పరువు హత్యగా భావించి సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అతను తన 18 ఏళ్ల కుమార్తె రోష్ణి కుమారి, 16 ఏళ్ల కుమార్తె అను కుమారిని గొంతు కోసి ఎందుకు చంపాడనే కోణంలో కూడా విచారిస్తున్నారు. మరోవైపు ఘటనానంతరం పరారీలో ఉన్న ఆమె భర్త నరేష్ బైతా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.