»Hero Siddharth Love Affair With Aditi Siddharth Clever Answer
Siddharth: అదితితో లవ్ ఎఫైర్..సిద్ధార్థ తెలివైన సమాధానం..!
తన తాజా చిత్రం "టక్కర్" తెలుగు వెర్షన్ కోసం ప్రమోషన్ల మధ్య, నటుడు సిద్ధార్థ్(Siddharth) హీరోయిన్ తో తన డేటింగ్ గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం చెప్పి కవర్ చేశాడు. ఇది నా గురించి, కానీ టక్కర్ చిత్రానికి పూర్తిగా సంబంధం లేదని పేర్కొన్నాడు.
సీనియర్ నటుడు, హీరో సిద్ధార్థ్(Siddharth), యంగ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి లు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి లవ్ ట్రాక్ పై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా సిద్ధార్థ్, అతిది డీప్ లవ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి పెయిర్ బాగా క్లిక్ అయ్యింది. మూవీ హిట్ కాకున్నా, వీరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యిందనే పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో వీరు ఎక్కడ కనిపించినా ఇదే ప్రశ్న వారికి ఎదురౌతోంది. తాజాగా ఓ రిపోర్టర్ ఆయనను ఇదే విషయం అడగగా, చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.
ఇంతకీ మ్యాటరేంటంటే..సిద్ధార్థ నటించిన టక్కర్ అనే సినిమా తమిళం, తెలుగులో విడుదల కానుంది. ఇటీవలే దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్(hyderabad)లో నిర్వహించారు. ఈ సినిమాకి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ మైక్ పుచ్చుకుని, అదితి రావు హైదరితో సిద్ధార్థ డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లను ప్రస్తావించాడు. ప్రేమ చిత్రాలకు ఎంతో పేరొందిన సిద్ధార్థ, వ్యక్తిగత జీవితంలో అంత సక్సెస్ కాకపోవడాన్ని కూడా సదరు రిపోర్టర్ ప్రశ్నించాడు. ‘‘నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఇలా ఆలోచించ లేదు. నా కలలో కూడా జరగలేదు. నా ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు కూడా. కానీ, నా లవ్ లైఫ్ గురించి నీవు అంతగా ఆందోళన చెందుతున్నందున ఇద్దరం కలసి వ్యక్తిగతంగా దీనిపై మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇతరులకు దీనితో పనిలేదు. టక్కర్ సినిమాకు కూడా దీనితో సంబంధం లేదు’’ అని సిద్ధార్థ బదులిచ్చాడు.