Chinna Movie Explained In Telugu Siddharth S.U.Arun Kumar Dhibu Ninan Thomas
Chinna: చిన్న.. సూపర్ గుడ్ మెలోడీ సాంగ్ తో టైటిల్స్ పడుతుంటాయి. పాప పుట్టినప్పటి నుంచి తనను పెంచే ప్రాసెస్ టైటిల్స్ లో చూపిస్తారు. ఓపెన్ చేస్తే.. యాదాద్రి బస్ స్టేషన్లో బస్సు ఆగుతుంది. శక్తి తన తమ్ముడితో బస్సు దిగి టాయిలేట్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడ టైలెట్ సరిగా క్లిన్ చేయదు, తనను వెనక్కి పిలిచీ టాయిలెట్ ని క్లిన్ చేయిస్తుంది శక్తి. దీంతో తన క్యారెక్టర్ ఎలాంటిదో రివీల్ అవుతుంది. నెక్ట్స్ సీన్లో చిన్న బస్టాప్ లో స్టిక్కర్స్ అతించమని మున్సిపాలిటీ వాళ్లకు చెప్తాడు. అతను స్టిక్కర్స్ తీసుకురావడం మర్చిపోయాను సర్ అంటాడు. దాంతో చిన్నా తీసుకురావడానికి బైక్ దగ్గరకు వెళ్తుంటే.. దారిలో శక్తి కనిపిస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. టైమ్ చూసుకొని హడావిడిగా చిన్నా వెళ్లిపోతాడు. శక్తి అలానే చూస్తూ ఉంటుంది.
చదవండి:Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ వివాదం.. డైరెక్టర్ ఓపెన్ లెటర్!
కట్ చేస్తే చిన్న చిట్టి స్కూల్ కు వెళ్తాడు. అక్కడ చిట్టి ఆటోలో వెళ్లింది అని వాచ్ మెన్ చెప్తాడు. నేను వస్తానని తెలుసుకదా అలా ఎలా పంపిస్తావు అని కోప్పడి వాచ్ మెన్ చొక్క పట్టుకుంటాడు చిన్నా. పాప ఏదో సరదా పడితే ఇలా అబద్దం చెప్పాను అని చెట్టు చాటుకు దాచుకున్న చిట్టిని చూపిస్తాడు వాచ్ మెన్. దాంతో రిలాక్స్ అయిన చిన్నా తన ఫోన్లో గేమ్ ఆడుతూ.. వీడిని ఎలా చంపాలి అంటుండగా.. ఫోన్ చూసి చిట్టి దగ్గరకు వచ్చి అలా కాల్చు, ఇలా కాల్చు అంటుంది. నన్నే ఆటపట్టిస్తావా అని చిట్టిని గిలిగింతలు చేస్తాడు. తరువాత ఇద్దరు కలిసి మార్కెట్ కు వెళ్తారు. అక్కడ తనకు కోడిపిల్లలు కావాలి అంటుంది. అవి రెండు రోజులకే చనిపోతాయి మళ్లీ నువ్వే ఏడుస్తావు అంటాడు. లాలి పాప్ కొనిపించి తీసుకెళ్తాడు. నేను కూడా ఫ్రెండ్స్ తో ఆటోలో వెళ్తా అని చిట్టి అంటుంది. అయితే నీకు చిన్నా వద్దా అంటే కావాలి అంటుంది. నువ్వు అలా వెళ్లిపోతే నా ప్రాణం పోతుంది అని చెప్తాడు.
తరువాత సీన్లో చిన్నా చికెన్ కడుగుతుంటాడు. వాళ్ల వదిన కుక్ చేస్తుంది. అంతలో చిట్టి పిలుస్తుంది. చిన్న వెళ్లి చిట్టిని డ్రెస్ వేసీ రెడీ చేస్తాడు. అతనికి ఒక సంబంధం చూసినట్లు వదిన చెబుతుంది. ఇప్పుడు అలాంటివి ఏమి వద్దని, తనకు టైమ్ అయిందని వెళ్లిపోతాడు. తరువాత తన ఫ్రెండ్ సురేష్ హోటల్ లో మున్నిని ఒల్లో కూర్చొబెట్టుకొని తనకు ఫ్రైడ్ రైస్ తినిపిస్తాడు. శక్తిని బస్ స్టాప్ లో చూసినట్లు మరో ఫ్రెండ్ వెంకటేష్ తో చెప్తాడు. వాళ్ల పేరేంట్స్ రెండు రోజుల ముందే వచ్చారు, వాళ్లుండే వీధిలో మనవాల్లే ఉన్నారు అని, తనకు ఇక్కడే ఉద్యోగం వచ్చిందని వెంకటేష్ చెప్తాడు. తరువాత మరో సురేష్ వచ్చి ప్లేట్ లో ఫ్రైడ్ రైజ్ తీసుకొని తింటుంటే మున్ని అతన్ని కొడుతుంది. తరువాత శక్తి పెళ్లి కాలేదని, లవర్ కూడా లేడని మాట్లాడుకుంటారు. మున్ని వాళ్ల అక్క రావడంతో ఇద్దరు ఆడపిల్లలను స్కూటీపై పంపిస్తారు. వాళ్లను ఒంటరిగా పంపించడం చిన్నాకు ఇష్టం ఉంటదు. చిన్నపిల్లల పట్ల చాలా ప్రొటెస్ట్ గా ఉంటాడు చిన్నా.
కట్ చేస్తే చిన్నా మార్నింగే లేచీ రెడీ అయి తన బైక్ లో మున్సిపల్ ఆఫీస్ కు వెళ్తాడు. అక్కడే ఏఓగా వర్క్ చేస్తుంటాడు. పని చేసేవారు అందరు నమస్కారం పెడుతారు. వారందరి అటెండన్స్ తీసుకొని పనిలోకి వెళ్లమంటాడు. అదే ఆఫీస్ లో శక్తి కూడా పనిలో చేరుతుంది. తరువాత తన ఫ్రెండ్ వెంకటేష్ కు ఫోన్ రమ్మంటాడు. అతను వచ్చి శక్తితో మాట్లాడి చిన్నాను కూడా మాట్లాడమని చెప్పి వెళ్తాడు. చిన్నా శక్తితో మాట్లాడుదమనుకుంటాడు కానీ కుదరదు.
నెక్ట్స్ సీన్లో ఏఓతో సైన్ పెట్టించమని శక్తికి ఒక లెటర్ ఇస్తాడు ఒక అధికారి. దాంతో శక్తి చిన్నా రూమ్ కు వెళ్తుంది. తనతో మాట్లాడలని కూర్చో అంటాడు. శక్తి కూర్చోదు సైన్ పెట్టమని సైగ చేస్తుంది. దాంతో చిన్నా సారీ చెబుతూ.. ఆ రోజు ఏమైంది అని అడుగుతాడు. నువ్వు ఎందుకు రాలేదు నేను ఎంత సేపు వెయిట్ చేశానో తెలుసా అంటుంది. అన్నయ్య కూతురిని తీసుకురావడానికి స్కూల్ కు వెళ్లా వచ్చేలోపే నువ్వు లేవని చిన్నా అంటాడు. అయితే ఇంటర్ మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు అని అడుగుతుంది. అది కాదు తన చేయి పట్టుకుంటాడు. శక్తి చిన్నా చెంపపై కొడుతుంది. శక్తి అలా శివర్ అవుతుంది. చిన్నా చూస్తూ ఉండిపోతాడు.
తరువాత సీన్లో చిట్టి క్లాస్ బయట నీల్ డౌన్ వేస్తుంది. చిన్నా వెళ్లి విషయం అడిగితే చిట్టి ఒక స్టూడెంట్ దగ్గర మ్యాజిక్ పెన్సిల్ తీసుకొని దాచిపెట్టిందని, పైగా నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అని ప్రిన్సిపల్ చెప్తుంది. తన పెన్సిల్స్ కూడా రోజు పోతున్నాయి దీని గురించి అడిగారా.. అయినా చిట్టి అలా దొంగతనం చేయదు అని చిన్నా చెప్తాడు. తరువాత చిట్టిని తీసుకొని వస్తుంటే ఆ మ్యాజిక్ పెన్సిల్ తానే తీసినట్లు చెప్తుంది చిట్టి. కట్ చేస్తే చిన్నా చిట్టి టీసీ తీసుకొని వస్తాడు. చదువు మధ్యలో మరో స్కూల్ ఎందుకు అని వాళ్ల వదిన అడుగుతుంది. ఒక పెన్సిల్ కే ఇలా అనుమాన పడుతున్నారు తరువాత ఫ్యూచర్ లో చిట్టిని దొంగగా చూస్తారని చిన్నా అంటాడు. తరువాత వెంకటేష్ వాళ్ల కోడలు మున్ని చదివే స్కూల్లో వేద్దామని అంటాడు. అదే సమయంలో చిట్టి ఏదో తింటూ వస్తుంది. ఏం తింటున్నావు అని కోపంతో చిట్టిని కొడుతుంది. చిన్నా అడ్డు పడుతాడు. చిన్నాను ఏం అనలేక నీ వల్లే ఇలా తయారు అయిందని చిట్టిని కొడుతుంది. కట్ చేస్తే చిన్నా భుజంపై చిట్టి చేయిపెట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. తరువాత చిట్టి వాళ్ల అమ్మ వచ్చి తన పక్కనే పాపను ప్రేమగా నిమురుతూ పడుకుంటుంది.
నెక్ట్స్ సీన్లో శక్తి ఆఫీస్ లో ఫ్యాన్ తూడుస్తుంది. అక్కడికి ఈశ్వర్ అదే చిన్న వెళ్లి లైట్స్, ఫ్యాన్ స్విచ్ లు వేస్తాడు. తనను చూసి కంగారుగా వాటిని ఆఫ్ చేయబోతుంటే కరెంట్ లేదని చెప్తుంది. దాంతో చిన్నా బయటకు వెళ్లబోతుంటే… ఈశ్వర్ అని పిలుస్తుంది. డస్టర్ ఫ్యాన్ రెక్కపై పెట్టి తన సాయంతో కిందికి దిగుతుంది. బయటకు వెళ్లబోతుంటే ఇంటర్ రిజల్ట్ వచ్చన రోజే వాళ్ల అన్నయ్య చనిపోయినట్లు చెప్తాడు. తరువాత చాలా రోజులు నీకోసం ఎదురు చూశానని చెప్తుండగా.. దాని గురించి మాట్లాడకు అని వెళ్లిపోతుంటే.. మాట్లాడను అని అంటాడు.. శక్తి ఆగిపోతుంది. తన హ్యండ్ పట్టుకుంటాడు. శక్తి ఏం అనదు. ఇంకా నయం కొడుతావేమో అనుకున్నా అంటాడు. అంతలో కరెంట్ వస్తుంది. ఫ్యాన్ మీదున్న డస్టర్ తనకు తాకుతుంది. కంట్లో దుమ్ము పడిందని అరుస్తుంటాడు. అంతలో మున్సిపల్ వర్కర్లు వచ్చి తనకు నీళ్లు పోసి సాయం చేస్తారు. శక్తిని చూస్తాడు తను చిన్నగా నవ్వుతుంది. సాంగ్ మొదలౌతుంది. ఇద్దరు ప్రేమలో ఉంటారు. ఈశ్వర్ అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. శక్తి చూసి సంతోషపడుతుంది. చిట్టిని, శక్తిని తీసుకోని రైడ్ చేస్తుంటాడు. అలా సాంగ్ ముగుస్తుంది.
మున్ని వాళ్ల ఇంట్లో, చిట్టి హోం వర్క్ చేసుకుంటారు. తరువాత జింకను చూడడానికి వెళ్దామా అని మున్ని అడుగుతుంది. ఊరుబయట పాడు బడ్డబాయి ఉంది కదా అక్కడ జికంలు ఉన్నాయని మా అక్క చెప్పింది. తాను కూడా వెళ్లిందని చెప్తుంది. చిట్టి సరే అంటుంది. తరువాత సీన్లో మున్ని వాళ్ల అక్క తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. నైట్ మనం మాట్లాడుకుంటుంటే మున్ని చూసిందని, ఇకపై నేను బావిదగ్గరకు రాను అంటుంది. మన విషయం మా మామకు తెలిసిందంటే ఇక అంతే అని అంటుంది. మరో వైపు సాయంత్రం 5 గంటలకు జింకాను చూడాలి అని మున్ని అంటుంది. చిన్నాకు తెలియకుండా వెళ్లాలా అని చిట్టి ఆలోచిస్తు ఉంటుంది. పాడుబడ్డ గుడికి వెళ్లాలి అని మున్ని అంటుంది.
తరువాత సీన్లో వెంకటేష్ జరిగిన గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడుతాడు. చాలా మంది పిల్లలు కూడా ఆ పాడుబడ్డ గుడి దగ్గరకు వెళ్తున్నారని పోలీసులు చెప్తారు. మరో సీన్లో చిన్నా మున్ని ఇంటికి వస్తాడు. అక్కడ మున్ని వాళ్ల నాన్న వాష్ రూమ్ నుంచి బయటకు వస్తూ.. అది చాలా పాచీ పట్టిందని అనుకుంటూ బయటకు వస్తాడు. అదే సమయంలో మున్సిపల్ వర్కర్ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అతన్ని పిలిచి వాష్ చేయమంటాడు. దానికి శక్తి ఒప్పుకోదు. నీ ఇంట్లో టాయిలెట్ కడగడానికి కాదు మేమున్నది అంటుంది. దాంతో అతనికి కోపం వచ్చి తిడుతాడు. అంతలో చిన్నా వచ్చి ఆపడానికి ట్రై చేస్తే అతను వినకుండా చేతులో పార పట్టుకొని అరుస్తుంటాడు. చిన్నాకు కోపం వచ్చి చేయి చేసుకుంటాడు. అతను మోరిలో పడుతాడు. అందరు అలా చూస్తుంటారు.
తరువాత సీన్లో చిన్నా పోలీస్టేషన్ బయట వెయిట్ చేస్తుంటాడు. స్టేషన్ నుంచి వెంకటేష్ వస్తాడు. మీ బావ విషయంలో సారీ చెప్పాడానికి వచ్చాడు అని సురేష్ అంటాడు. దానికెందుకు రా సారీ.. మా అక్క నీ కన్న ఎక్కువ తిడుతుంది.. నువ్వేమన్న కొట్టావా అంటాడు. అందుకే సారీరా కొట్టాను అంటాడు. అతను ఏం అంటాడో అనుకుంటుంటే నిజంగా కొట్టావా, నేను చాలా సార్లు కొడుదాం అనుకున్నా అని సంతోష పడుతాడు వెంకటేష్.
నెక్ట్స్ సీన్లో చిట్టిని స్కూల్ కు తీసుకొస్తాడు. ఈ రోజు సాయంత్రం పాడుబడ్డ గుడికి వెళ్దామని, చిన్నాను 5.30 రమ్మని మున్ని చెప్తుంది. చిన్నా ఫోన్ మాట్లాడుకుంటూ సరే అని వెళ్తాడు. సాయంత్రం స్కూల్ టైమ్ అవగానే పిల్లలిదద్దరు వెళ్దాం అనుకొని బయటకు వస్తారు. స్కూల్ బయట చిన్నా వెయిట్ చూస్తుండడం చూసి ముందు భయపడుతారు. తరువాత స్కూల్ వ్యాన్ అడ్డుపెట్టుకొని ఆటో ఎక్కి పాడుబడ్డ గుడికి అని చెప్తుంది మున్ని. మీరిద్దరే వెళ్తున్నారా అని ఆటో డ్రైవర్ అంటే అక్కడ మా మామ వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుంది. ఆటో కదిలే లోపే చిట్టి కిందికి దిగి.. చిన్న దగ్గరకు వెళ్తుంది. కట్ చేస్తే యోగ క్లాస్ అలా ఎలా కాన్సెల్ చేస్తారు. చిట్టి ఒక్కర్తే బయట ఉంది అని వాళ్ల వదినతో మాట్లాడుతుంటాడు. అంతలో చిన్నాకు ఫోన్ వస్తుంది. ఎవరో చూడమని చిన్నాను ఆపి, చిట్టికి చెప్తుంది. అది సరదాగా ఉంటుంది.
కట్ చేస్తే క్లాస్ లో మున్నికి చిట్టి సారీ చెప్తుంది. మున్ని అలానే బయటకు చూస్తూ ఉంటుంది. టీచర్ చూసి కొప్పడుతుంది. మున్ని పైకి లేచి ఏడుస్తుంది. దాంతో టీచర్ కూర్చో అంటుంది. తనకు వామ్టింగ్ వస్తుంది. తనతో పాటే చిట్టి వెళ్తుంది. మాట్లాడు అంటే మున్ని మాట్లాడదు. తరువాత స్కూల్ బెల్ అయిన తరువాత మున్ని వెళ్లిపోతుంది. తన కూర్చున్న ప్లేస్ తడిసిపోయి ఉంటుంది. మున్ని భయంతో టాయిలేట్ చేసుకుని ఉంటుంది. తరువాత సీన్లో చిట్టి బయటకు వచ్చి చిన్నాతో మున్ని మాట్లాడట్లేదని చెప్తుంది. దాంతో చిన్నా మున్నితో మాట్లడానికి ట్రై చేస్తే పాప భయపడుతుంది. తన పరిస్థితిని చూసి ఇంటిదగ్గర దిగబెడుతా అని చిట్టిని స్కూల్ దగ్గరే వదిలేసి తనను తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ల నాన్న ఉన్నాడని, బయటే దిగబెట్టి ఏం జరిగింది మున్ని అని అడుగుతాడు. తాను బెదిరిపోతుంది. ప్రేమగా దగ్గరకు తీసుకోబోతుంటే దూరం వెళ్తుంది. తన బిహేవియర్ చూసి వెంకటేష్ కు కాల్ చేస్తాడు. అంతలో మున్ని ఏడుచుకుంటూ పరిగెత్తుతు ఇంటికి వెళ్తుంది. ఇదింతా ఎవరో రికార్డు చేస్తారు.
తరువాత సీన్లో చిన్నా స్నానం చేస్తుంటే వెంకటేష్ ఫోన్ చేసి, మున్ని కళ్లు తిరిగి పడిపోయిందట.. త్వరగా వెళ్లు అని చెప్తాడు. కట్ చేస్తే ఈశ్వర్ అంటూ మున్ని బాబాయి ఇంటికి వచ్చి చిట్టిని, తన తల్లిని తీసుకొని మున్ని ఇంటికి తీసుకెళ్తాడు. మున్ని ఆసుపత్రిలో ఉందని, తనను పాడు చేశాడని ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో తప్పేమి లేదని వదిన అంటుంది. తరువాత పాపను పిలిపించి నువ్వెందుకు బైక్ పై రాలేదంటే.. చిన్నానే వద్దన్నాడు అని చెప్తుంది. తన కూతురి బతుకు ఆగం అయిందని చిన్నాను చంపేస్తా అని డోర్ తీస్తాడు. బట్టలు ఊడదీసి కొడుతారు చిన్నాను. అది చూసి వదిన కంగారు పడుతూ వదిలేయండి అని ఏడుస్తుంది. అంతలో అక్కడికి లేడీ పోలీసులు వస్తారు. ఇది ఫోక్సొ చట్టం కిందకు వస్తుందని అతన్ని విచారణ చేయాలి అని లోపలికి వెళ్తారు. కట్ చేస్తే చిట్టి, తల్లి పోలీసు స్టేషన్ బయట కూర్చుంటారు. అక్కడికి సురేష్ టీ తీసుకొస్తాడు. వాళ్లు తాగరు. శక్తి చిన్నాను చూడడానికి వస్తుంది. అదే సమయంలో వెంకటేష్ వచ్చి కేసు వద్దు. పాప ఫ్యూచర్, పరువు పోతుందని చెప్పి ఎస్ఐ తో మాట్లాడుతాడు. ఇలాంటి వాళ్లను వదిలేస్తే ఎలా అంటుంది ఎస్ఐ. తరువాత వెంకటేష్ బయటకు వస్తుంటే, చిన్నా వెనకాలే వస్తు.. తనతో మాట్లాడానికి ట్రై చేస్తాడు. మున్నిని ఏం చేయాలేరా.. అంటే చిట్టిని ఎందుకు తీసుకపోలేదు అని వెంకటేష్ అడుగుతాడు. దానికి చిన్నా ఏం సమాధానం చేయడు. తెలియదురా అంటాడు. దాంతో చిన్నాను వెంకటేష్ కొడుతాడు. సురేష్ ఆపుతాడు. వెంకటేష్ కొడుతూనే ఉంటాడు. అందరు వచ్చి ఆపుతారు.
నెక్ట్స్ సీన్లో చిన్నా వాష్ రూమ్ లో కూర్చొని ఏడుస్తుంటాడు. తరువాత డోర్ బయట కూర్చొని ఏదో ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో చిట్టి వెనుక నుంచి వచ్చి చేతులు వేస్తుంది. చిన్నా ఒక్కసారిగా బెదిరిపోతాడు. చిట్టిని వదిన పిలిచి అన్నం ఇక్కడే పెట్టాను తిను అంటుంది. తరువాత సీన్లో సురేష్ తో చిన్నా మాట్లాడుతుంటాడు. ఆ ఫోన్లో ఏం ఉందిరా అందరూ దాన్ని పట్టుకొని పెద్ద రాద్దంతం చేస్తున్నారు. అని తినడానికి పూరి ఇస్తాడు. అదే సమయంలో శక్తి వస్తుంది. తన చేతులను పట్టుకొని మాట్లాడుతూ తన కాళ్లమీద పడుకుంటాడు. సుందరిని ఎందుకు ఒంటిరిగా వదిలేసి వెళ్లావు అని శక్తి అంటుంది. తను కూడా అనుమానిస్తుందని, వదిలేసి వెళ్తే ఏంటి అని అరిచి, తనను వెళ్లిపో అంటాడు. శక్తి వెళ్లిపోతుంది. తరువాత ఇంటికి వస్తాడు. చిట్టిని వదినపక్కన పడుకోబెట్టుకుంటుంది. అది చూసి చిన్నా బాధపడుతాడు.
ఉదయం చిట్టిని స్కూల్ కు రెడీ చేస్తూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెబుతుంది. చిన్నా బ్యాడ్ టచ్ చేసినా నీకు చెప్పాలా అంటుంది పాప. దానికి అవును అంటుంది వాళ్ల అమ్మ. ఆ మాటలను చిన్నా వింటాడు. బాధతో బయటకు నడుచుకుంటూ వస్తాడు. అలా కాదు నేను చెప్పేది విను అంటూ వదిన అంటున్నా వినిపించుకోడు. అలా వెళ్లి ఒక బావి దగ్గర నిలబడుతాడు. అక్కడికి వెంకటేష్ వస్తాడు. మున్ని ఎలా ఉందిరా అంటే సారీరా అని చిన్నాను హగ్ చేసుకొని ఏడుస్తాడు. ఆ సమయంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు. నువ్వేమి బాధపడకు అంటాడు చిన్నా. అదే సమయంలో చిన్నాను వెతుకుతూ చిట్టి వీధిలో వస్తుంది. తను కోడిపిల్లలను చూపించి, గేమ్ ఆడుతూ తనకు ఫోన్ ఇచ్చి చిట్టిని తీసుకొని వెళ్తాడు ఒకడు.
అదే సమయంలో బాడుబడ్డ బావి దగ్గర వెతికితే ఏదైనా దొరకొచ్చని వాళ్లు వెళ్తుంటే చిన్నా వాల్ల వదిన పాప కనిపించడం లేదంటూ రోడ్డు మీద పడిపోతుంది. తనను బైక్ మీద ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే పిల్లలు కోడిపిల్లలను తీసుకొని వస్తుంటారు.
తరువాత సీన్లో పోలీస్టేషన్లో చిట్టిని తీసుకెళ్తున్న సీసీ ఫుటేజ్ ను వెంకటేష్ చూస్తుంటాడు. అక్కడికి చిన్నా వస్తాడు. అది చూస్తే పాపే ఇష్టపడి వెళ్లినట్లు అనిపిస్తుంది అని ఎస్ఐ అంటుంది. ఆ మాటలకు చిన్నా కోప్పడుతాడు. పాప మిస్ అయిన బాధలో ఉన్నాడు అని వెంకటేష్ చెప్తాడు. కట్ చేస్తే ఒక మహిళ అలా వస్తూ ఏదో చూసి భయపడుతుంది. కట్ చేస్తే అక్కడ చాలా మంది వ్యక్తులు, పోలీసులు ఉంటారు. 10 సంవత్సరాల పాప కాలిన బాడీ ఉందని పోలీసు చెప్తాడు. తరువాత మార్చురీలో బాడీని చూడడానకి చిన్నా, వదిన ఇద్దరు వెళ్తారు. తాను వాళ్ల పాప కాదని చెప్తారు. చిట్టికోసం వెతుకుతారు. కండక్టర్ ను అడిగితే వారు జనగామలో దిగిపోయారు అని చెప్తాడు. చిన్నా అందరిని వెతుకుతుంటారు. చెట్లల్లో, గుట్టలల్లో అంతటా వెతుకుతుంటారు.
తరువాత వారికి పోలీసులు ఎదురొచ్చి ఆ పాపే చిట్టి అని చెప్తాడు. అదే విషయాన్ని చిన్నాతో చెప్తే తాను చిట్టి కాదు అని ఏడుస్తాడు. తరువాత వాళ్లను కాజీపేటలో దింపిన టాటాఏసీ డ్రైవర్ ను అడుగుతుంటే.. చిట్టి వాడే వాటర్ బాటిల్ కనిపిస్తుంది.
ఆ పిల్లను అడిగితే మొన్న కాలిన శవం దగ్గర దొరికింది అని చెప్తారు. దాంతో చిన్నా ఏడుస్తాడు. పాప దిగి చిన్నాకు బాటిల్ ఇచ్చి వెళ్తుంది. తరువాత వెంకటేష్, చిన్నా కలిసి ఆసుపత్రికి వెళ్తారు. చనిపోయిన పాప వయస్సు 11 ఏళ్లు వాళ్ల పేరెంట్స్ ముందే పోస్ట్ మర్టం చేశా అని చెప్తాడు. దాంతో చిట్టిని వెతకాడానికి చిన్నా బైక్ పై కూర్చుంటాడు. ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. మరో సీన్లో ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుకుంటారు. ఆ బాటిల్ తోనే పెట్రోల్ తెప్పించిన్నట్లు ఒక వీడియోను చూపిస్తారు. నేరస్తుడిని త్వరగా పట్టుకోవాలి అని లేదంటే రిస్క్ పెరుగుతుందని ఆఫీసర్ అంటాడు. చిట్టికి ఇష్టమైనవేంటో అడుగుతారు. చిన్నా అన్నింటిని చెప్తాడు. మరో అమ్మాయి దొరికేంత వరకు చిట్టి ప్రాణాలతో ఉంటుంది ఈ లోపు వాన్ని పట్టుకోవాలి అనుకుంటారు. అన్ని షాప్స్ లో వెతుకుతుంటారు. ఒక అతను పాపను గుర్తు పట్టి తనను పాత బ్రిడ్జి దగ్గర చూసినట్లు, దిల్ పసంద్ కొన్నట్లు చెప్తాడు. దాంతో పోలీసులు బ్రిడ్జీ దగ్గర కపాలా కాస్తారు. అది ఫెయిల్ అవుతుంది.
మరో సీన్లో టీ తాగుతూ వెంకటేష్, చిన్నా మాట్లాడుకుంటారు. చిట్టి ఇక్కడే ఎక్కడో ఉంది అని, అతన్ని వెతకాలని బైక్ లో వెళ్తారు. అదే సమయంలో కిడ్నాపర్ లాలీపాపులు, పాలు, షర్లాక్ తీసుకుంటాడు. నెక్ట్స్ సీన్లో పాపతో మాట్లాడుతాడు. సంచిలో పాము ఉందని మాట వినకపోతే కరుస్తుంది అని బెదిరిస్తాడు. దాంతో పాప స్నానం చేస్తా అంటుంది. తనకు అతనే స్నానం చేయిస్తాడు. మరో సీన్లో కిడ్నాపర్ కోసం పాత బ్రిడ్జ్ దగ్గర పోలీసులు వెయిట్ చేస్తారు. అదే సమయంలో కిడ్నాపర్ నడుచుకుంటూ వస్తూ దిల్ పసంద్ ఉందా అని ఓ ముసలి అతన్ని అడుగుతాడు. లేదంటాడు.. అనుమాన పడిన ముసలి వాడు పక్కనే తన అల్లుడు ఉన్నాడు అని ఫోన్ చేస్తే అది కలువదు. అంతలో అక్కడికి పోలీసు వాహానం వస్తుంది. అది వెళ్లగానే కిడ్నాపర్ నడుచుకుంటు వెళ్తాడు. దిల్ కుష్ తీసుకొమ్మని వృద్దుడు వెంటపడి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కిడ్నాపర్ తప్పించుకొని పారిపోతాడు. కిడ్నాపర్ ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్లాలి అని చిట్టిని లేవమంటాడు. దానికి చిట్టి ఏడుస్తుంటే.. చిట్టిని కింద పడేసి మెడను గట్టిగా పిసుకుతాడు.
కట్ చేస్తే రోడ్డులో చెక్ పోస్ట్ పెట్టి అన్ని వాహనాలను చెక్ చేస్తుంటారు. అదే సమయంలో కిడ్నాపర్ గుండు గీసుకొని రొడ్డు పైకి వచ్చి చిట్టికి వాటర్ బాటిల్ ఇచ్చి పెట్రోల్ తీసుకురా అని పంపిస్తాడు. తాను భయపడుకుంటు వెళ్తుంది. అదే సమయంలో కారు వచ్చి సడెన్ బ్రేక్ వేస్తుంది. దాంతో కిడ్నాపర్ తను నా పాపే అని వాళ్లకు చెప్తాడు. ఆటోలో ఎక్కించుకొని వెళ్తుంటే చెక్ పోస్ట్ పెట్టారు అని తెలిసి భయపడి, ఫోన్ వచ్చినట్లు నాటకం ఆడుతాడు. నాకు అర్జెంట్ పని ఉందని, చెక్ పోస్ట్ అయిపోగానే దించేయండి వాళ్ల అమ్మ వచ్చి తీసుకెళ్తుంది అని చెప్పి వేరో ఆటో ఎక్కుతాడు. అమ్మాయి వణికిపోతూ ఉంటుంది. ఏం జరిగింది అని ఆటోలో ఉన్నావిడ అడుగుతుంది. తనకు అనుమానం వచ్చి వెళ్లి పోలీసులతో చెప్తుంది. పోలీసులు వచ్చి తన చేతులోని సంచిని పట్టుకొని అడగగానే తను వణికిపోతూ ఉంటుంది. తరువాత సృహ తప్పిపడిపోతుంది. దాంతో పోలీసు పాపను ఎత్తుకొని ఆసుపత్రికి పరుగెడుతుంటాడు. అక్కడే ఉన్న చిన్నా పాపను చూసి పరుగెత్తుకుంటు వెళ్లి చిట్టిని ఎత్తుకొని, గుండెకు హత్తుకొని చిట్టి చిట్టి అని ఎమోషనల్ అవుతాడు.
తరువాత సీన్లో ఆసుపత్రిలో పోలీసులు వచ్చి అతన్ని త్వరగా పట్టుకోవవాలి అని మాట్లాడుతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఈశ్వర్ వాడు దొరికితే నాకు పట్టివ్వు.. నా చేతులతో చంపెయ్యాలి అని అంటాడు. పాపను దాచిన ప్లేస్ ను కూడా కనిపెట్టామని మరో 24 గంటల్లో వాడు దొరుకుతాడు అని పోలీసులు చెప్తారు. 24 రోజుల తరువాత అని టైటిల్ పడుతుంది. చిట్టికి డైపర్ మారుస్తుంటే భయపడి అబ్ నార్మల్ గా బీహేవ్ చేస్తుంది. అది చూసి చిన్నా బాధపడుతుంటాడు. మరో సీన్లో లేడీ ఎస్ఐతో వాడిని ఎప్పుడు పట్టుకుంటారు అని అడుగుతాడు. తరువాత చిట్టికి కావాల్సిన వాటిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లగానే అక్కడ మున్ని ఉంటుంది. ఈశ్వర్ ను చూసి పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంది. ముద్దుపెడుతుంది. తరువాత చిట్టి, మున్ని ఇద్దరు మాట్లాడుకుంటారు.
తరువాత సీన్లో శక్తికి వెంకటేష్ ఫోన్ చేస్తాడు. ఈశ్వర్ ఎక్కడ వాడు దొరికాడు అంటాడు. నెక్ట్స్ సీన్లో ఈశ్వర్ గాజు సీసలు దంచి కత్తికి ఫెవికల్ పూసి, గాజు సీసల అంటిస్తాడు. మరో సీన్లో ఈశ్వర్ ను ఏం చేయొద్దు అని చెప్పు, వాన్ని చట్టం చూసుకుంటుందని వెంకటేష్ శక్తితో చెప్తాడు. తరువాత శక్తి ఈశ్వర్ తో మాట్లాడుతుంది. అతన్ని నా చేతులతో చంపేస్తా అని చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో కోర్టులో హీయరింగ్ నడుస్తుంది. మున్నిని, సుందరిని ఇలా చేసినవాడిని బోనులో ప్రవేశపెడుతారు. మరో సీన్లో నేరస్తుడిని గుర్తుపట్టడానికి మున్నిని స్పెషల్ రూమ్ కు తీసుకెళ్తారు. అదే సమయంలో ఈశ్వర్.. కోర్టు కేసును సందులోంచి చూస్తుంటాడు. అది చూసి పోలీసు బయటకు వెళ్లాలంటుంది. నెక్ట్స్ సీన్లో శక్తి ఈశ్వర్ బైక్ కీస్ లాక్కుంటుంది. సుందరికి, వదినకు నువ్వు మాత్రమే దిక్కు అని ఇలా చేస్తే జైల్ కు వెళ్తావు అని అంటుంది. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అని చెప్తుంది. తరువాత తన చేతులోంచి బైక్ కీస్ లాక్కొని వెల్లిపోతాడు. టీవీలో మున్నితో మాట్లాడి నేరస్తుడిని గుర్తుపట్టమని అతన్ని చూపిస్తారు. మరో సీన్లో సుందరి వాళ్ల అమ్మ వచ్చి చిట్టిని అలా చేసింది వాడు కాదని చెప్తుంది.
నెక్ట్స్ సీన్లో శక్తి సురేష్ ఇంటికి వెళ్లి తన భార్యను అడుగుతుంది. దాంతో సురేష్ కు ఫోన్ చేసి చిట్టిని అలా చేసింది అతను కాదు అని చెప్తుంది. సురేష్ బస్సులు వెతుకుతాడు. మరో సీన్లో వెంకటేష్ ను శక్తి హెల్ప్ అడుగుతుంది. వాన్ని పొడిచేసి బైక్ పై ఎస్కేప్ అయ్యే ప్లానా… కన్ ఫామ్ గా దొరికిపోతారు అని వెంకటేష్ అంటాడు. తరువాత సీన్లో చిన్నా బస్సులో వెయిట్ చేస్తాడు. అదే బస్సులో నేరస్తుడు ఉంటాడు. మరో సీన్లో వెంకటేష్ ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడుతుంటాడు. బస్సు బస్టాప్ లో ఆగుతుంది అదే సమయంలో చిన్నా అతన్ని పొడువబోతుంటే సురేష్ వచ్చి ఆపుతాడు. కిందికి తీసుకెళ్లి సుందరిని అలా చేసింది వీడు కాదు, మున్నిని చేసింది, చిట్టిని చేసింది ఇద్దరు వేరే అని చెప్తాడు. వీడు మున్ని పాడు చేసినవాడు అని చెప్తాడు. దాంతో కోపంతో చిన్నా కత్తితీసుకొనిన వాడిని బస్సులో పొడిచి చంపేస్తాడు.
ఒక్కడిని చంపేశాడు. ఇంకోకడని చంపెస్తా అంటున్నా అంటున్నాడు. ఒక్కదానికి ఇద్దరి పోలీసుల ఉద్యోగాలు పోయాయి అని వెంకటేష్ చెప్తాడు. సుందరిని ఇలా చేసిన వాడు ప్రాణాలతో ఉన్నాడు అని చిన్నా అంటాడు. నువ్వు ఉంటావనే కదా తనను ధైర్యంగా పెంచుతున్నా అని వదిన అంటుంది. నేను ఎప్పుడు మీతోనే ఉంటా అని చిన్నా అంటాడు. దానికి శక్తి ఎప్పుడూ ఎలా ఉంటావు అని అరిచి శివర్ అవుతుంది. నీళ్ల కోసం వదిన ఇంట్లోకి వెళ్తుంది. ఆ రోజు నీకోసం ఎదరుచూస్తున్నప్పుడు మా చిన్న మామ వచ్చాడు. నన్ను అక్కడ చూసి.. మృగంలా మారాడు. నన్ను పొదల్లోకి తీసుకెళ్లాడు. వద్దు మామ అన్న వినలేదు అని చెప్తుంది. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటాడు చిన్నా. దాంతో నీకు చంపడమే పనినా.. అయినా పగ తీర్చమని సుందరి అడిగిందా.. నీకు ఇష్టమైనదే చేస్తున్నావు.. ఇవన్ని వదిలేసి ఇప్పటికైనా మంచిగా ఉండూ అంటు అక్కడినుంచి శక్తి వెళ్లిపోతుంది.
తరువాత సీన్లో చిట్టి బెడ్ పై నిద్రపోతూ ఉంటుంది. చిన్నా పక్కనే బాధతో చూస్తుంటాడు. చిట్టి చిన్నాను పిలిచి తన చొక్క పట్టుకొని, ఆ రోజు నీకోసం వస్తున్నాను, దారి తప్పి వెతుకుంటే వాడు ఫోన్ ఇచ్చాడు అని చెప్తుతుంది. చిన్నా ఎమోషనల్ అవుతాడు. తన బెడ్ పై బాధతో పడుకుంటాడు. ఒక సంవత్సరం తరువాత టైటిల్ పడుతుంది. వదిన హడావిడిగా ఎదో పని చేసుకుంటుంది. చిట్టి బయటకు వచ్చి చిన్నా అంటూ నవ్వుతుంది. కట్ చేస్తే పోలీసులు పంచనామా రాసుకుంటారు. సుందరిని కిడ్నాప్ చేసిన వాడిని ఎవరో చంపారని పోలీసులు మాట్లాడుకుంటారు.