»Vijay Mallyas Son Siddharth Engagement With Her Girlfriend
Vijay Mallyas son: నిశ్చితార్థం..యువతి ఎవరంటే
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా(vijay mallya) పేరు అందరికీ తెలిసిందే. అయితే అతని కుమారుడు ఇటివల తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. సరికొత్త పద్ధతిలో తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
Vijay Mallya's son siddharth engagement with her girlfriend
హాలోవీన్ పార్టీని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పాశ్చాత్య సంస్కృతిలో ఈ రోజుకి భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ సందర్భంగా విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా(siddharth mallya) తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. సిద్ధార్థ్ నిశ్చితార్థానికి హాలోవీన్‌కి ఏమి సంబంధం అని మీరు ఆశ్చర్యపోవచ్చు? సిద్ధార్థ్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్‌కి ప్రపోజ్ చేసిన హాలోవీన్ థీమ్ దెయ్యం తరహాలో ఉండటం విశేషం.
ఈ విషయాన్ని నవంబర్ 1న సిద్ధార్థ్ మాల్యా తన స్నేహితురాలు జాస్మిన్‌తో తన నిశ్చితార్థానికి(engagement) సంబంధించిన కొన్ని చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నాడు. మొదటి చిత్రంలో సిద్ధార్థ్ తన మోకాళ్లపై కూర్చుని తన ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్నాడు. హాలోవీన్ ట్రెండ్‌కి తగ్గట్టుగా విజయ్ మాల్యా కొడుకు గుమ్మడికాయ డ్రెస్ వేసుకున్నాడు. అతని స్నేహితురాలు మంత్రగత్తె థీమ్ దుస్తులను ధరించింది. రెండవ చిత్రంలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోజులివ్వడం కనిపిస్తుంది. చిత్రాలలో జాస్మిన్ తన ఉంగరాన్ని చూపుతూ కనిపిస్తుంది.
ఈ చిత్రాలను పంచుకుంటూ సిద్ధార్థ్ ఇలా వ్రాశాడు. ఐ లవ్ యూ మై జాఫెట్ అని పేర్కొన్నాడు. ఆ క్రమంలో గుమ్మడికాయ, రెడ్ హార్ట్, రింగ్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ఈ గుమ్మడికాయకు అవును అని చెప్పినందుకు ధన్యవాదాలు అని అతను రాసుకొచ్చాడు. అతని పోస్ట్‌పై సుస్సానే ఖాన్ స్పందిస్తూ ‘అభినందనలు, ఇది చాలా క్యూట్‌గా ఉంది’ అని అన్నారు. ఇది తెలిసిన పలువురితోపాటు అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే సోషల్ మీడియాలో జాస్మిన్ ఎవరనే సమాచారం పెద్దగా లేదు. జాస్మిన్ సిద్ధార్థ్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తున్నారు. జాస్మిన్ ఇన్స్టాగ్రామ్ ప్రకారం ఆమె ప్రయాణాలను ఇష్టపడుతుంది. ఆమె ప్రపంచమంతా తిరుగుతుంది. ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంటూ ఉంటుంది. ఈ చిత్రాలు చూశాక ఆయన ప్రయాణ ప్రియుడని అర్థమవుతుంది. ఇది మాత్రమే కాదు, జాస్మిన్ ప్రకృతి, డాగ్స్ లవర్ అని కూడా తెలుస్తోంది.