»Taapsee Pannu Taapsees Secret Affair For Ten Years
Taapsee Pannu: పదేళ్లుగా తాప్సీ సీక్రెట్ ఎఫైర్!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్‌తో నటించిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. అస్సలు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అమ్మడి ఫోకస్ అంతా హిందీ సినిమాల మీదే ఉంది. తాజాగా అమ్మడు తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది.
Taapsee Pannu: టాలీవుడ్‌ను కంప్లీట్‌గా వదిలేసిన తాప్సీ.. బాలీవుడ్లో లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది తాప్సీ. ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఓటీటీలోనూ తాప్సీకి మంచి క్రేజ్ ఉంది. మరోవైపు విధంగా గ్లామర్ డోస్ పెంచేసింది తాప్సీ. అయితే ఇటీవల డంకీ ప్రమోషన్లో భాగంగా.. తన లవ్, బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది తాప్సీ.
తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తన సీనియర్, 10వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని.. కానీ స్టడీస్ కారణంగా అతను తనని దూరం పెట్టాడని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ లవ్‌స్టోరీ గురించి ఓపెన్ అయిపోయింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ లవ్‌లో ఉందంటూ అప్పట్లోనే వార్తలొచ్చాయి. కానీ తాప్సీ మాత్రం తన లవ్ ఎఫైర్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. తాజాగా ఈ విషయంపై తన మనసులో మాటను బయటపెట్టింది తాప్సీ. దాదాపు పదేళ్ల నుంచి మాథిస్‌తో ప్రేమలో ఉన్నానని చెప్పింది.
బాలీవుడ్‌కి వచ్చిన కొత్తల్లో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాను రాను మా బంధం బలపడుతూ వచ్చింది. అయితే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మాథిస్ బోతో నేను చాలా సంతోషంగా ఉన్నా. బ్రేకప్ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ రాలేదు.. అని చెప్పుకొచ్చింది తాప్సీ. మొత్తంగా తాప్సీ త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతోందన్నమాట.