»Ys Sharmila Ys Sharmila For Ap This Is The Schedule
YS Sharmila: ఏపీకి వైఎస్ షర్మిల..షెడ్యూల్ ఇదే
ఏపీలో పర్యటనకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు షర్మిల. రేపు, ఎల్లుండి అంటే 20,21వ తేదీలలో షర్మిల ఏపీలో పర్యటించనున్నారు.
YS Sharmila: ఏపీలో పర్యటనకు షర్మిల రెడీ అయింది. రెండు రోజుల పాటు పర్యటించడానికి షెడ్యూల్ ఖారారు చేసారు. రేపు, ఎల్లుండి అంటే 20,21వ తేదీలలో షర్మిల ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 20వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2గంటలకు షర్మిల ఇడుపులపాయకు బయలుదేరతారు. ఇక సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేసి, మరుసటిరోజు విజయవాడకి బయలుదేరతారు. 21వ తేదీన కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10గంటలకు చేరుకుంటారు. అనంతరం విజయవాడలో ఉదయం 11గంటల సమయంలో షర్మిల రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇటివల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కాండువా కప్పుకున్నారు షర్మిల. అప్పటినుండి ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటూ, రాజకీయ నేతలతో కలుస్తున్నారు. షర్మి భవిషత్య కార్యాచరణకు కడప నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. దీంతో, రాబోయే ఎన్నికల్లో కడప రాజకీయం, కీలక మార్పులతో పాటు మరింత ఇంట్రస్టింగ్ గా మారనుంది.