»Jupally Krishnarao Telangana Is Not A Land Of Gold A Pile Of Debts
Jupally KrishnaRao: తెలంగాణ బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్ప
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రయత్నిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో పెట్టారని జూపల్లి ఆరోపించారు.
Jupally KrishnaRao: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రయత్నిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు తీసుకురావడం కోసం పారిశ్రామికవేత్త అదానీని సీఎం కలిశారని అతను తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని జూపల్లి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఒక బంగారు పళ్లెం అని బీఆర్ఎస్ నేతలు అన్నారు. కానీ రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారని జూపల్లి పేర్కొన్నారు. రూ. 40 వేల కోట్లు వడ్డీలకే పోతుందని తెలిపారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చిందని.. కానీ అవి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన నిర్వహించామని జూపల్లి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని జూపల్లి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడటానికి ఇప్పటికే చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్లో నీరు నిండుగా ఉన్నా.. సాగుకి నీరు ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటిపోయాయి. కృష్ణా బేసిన్లో నీరు లేనప్పుడు రెండో పంటకు నీరు ఇవ్వడం ఎలా సాధ్యమని జూపల్లి అన్నారు.