»In Bachupalli Hyderabad When He Wanted To Get Married He Pushed Him Under A Tanker
Attack: పెళ్లి చేసుకోమంటే..ట్యాంకర్ కిందకు తోసేశాడు
ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న యువతిని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు ప్రేమ, వ్యవహారం నడిపించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. చివరకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీయడంతో నీళ్ల ట్యాంక్ కింద తోసేశాడు. అది ప్రమాదవశాత్తు అని నమ్మంచే ప్రయత్నం చేశాడు.. కానీ చివరకి ఏమైందంటై..
In Bachupalli, Hyderabad, when he wanted to get married, he pushed him under a tanker
Accident: నేటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ప్రేమించిన వారే నిండా ముంచేస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ విషయంలో ఎలాంటి భయాలు లేకుండా దారుణమైన నేరాలు చేస్తున్నారు. ప్రియుడి అండతో భర్తను, ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను హతమారుస్తున్నారు. హస్బెండ్ చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ తరువాత కొన్నాళ్లు వ్యవహారం సాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం(Engagement) చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీయడంతో ఆమెను నీళ్ల ట్యాంకర్ కిందకు తోసేశాడు. మృతిని ప్రమాదంగా చిత్రీకరించడానికి చాలా రకాలుగా కష్టపడ్డాడు.
కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ బాచుపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాకు చెందిన హరిజియా కుమార్తె భూక్యా ప్రమీల (23) ఇంటర్ పూర్తిచేసి కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. 2022 జనవరిలో ఆమెకు వివాహం కాగా ఏప్రిల్‌లో భర్త చనిపోయారు. దాంతో తన పోషణ కోసం ఆమె నగరంలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు యువతులతో కలిసి ఉంటూ బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పనిచేస్తున్నారు.
ఆమెకు తన సొంతూరు సమీపంలోని రోడ్బండ తండాకు చెందిన భూక్యా తిరుపతినాయక్ (25)తో చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. తాను కూడా నగరంలోనే ఉంటాడు. కొండాపూర్‌లో ఉంటూ కారుడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటినుంచే పరిచయం ఉండటం, యువతి ఒంటరిగా ఉండడంతో తిరుపతి ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో తిరుపతికి ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం జరగింది. విషయం తెలుసుకున్న ప్రియురాలు అతనికి ఫోన్లు చేస్తూ.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. లేనట్లయితే తల్లిదండ్రులకు విషయం చెబుతానని గట్టిగా చెప్పింది.
ఆదివారం ఉదయం కలవాలని కోరింది. తిరుపతి తన మిత్రుడితో వెళ్లి, బాచుపల్లి ప్రధాన రహదారి వద్ద కలిశాడు. పెళ్లి విషయంపై ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేశానికి లోనైన నిందితుడు ఆమెను అటుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్ కిందకు తోసేశాడు. దీంతో ఆమె స్పాట్లోనే మృతి చెందింది. అయితే ఈ మొత్తాన్ని ప్రమాదంలా నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెబుతూ నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సుమన్‌కుమార్, ఎస్సై సంధ్య తెలిపారు.