»Gaitami Bridge In Rajamahendravaram A Girl Who Saved Her Life With The Spirit Of Time
Viral News: సమయ స్పూర్తితో ప్రాణాలు కాపాడుకున్న చిన్నారి
పైన అంతా చీకటి, చేజారితే కింద గోదావరిలో పడిపోవడం ఖాయం. కానీ ఓ చిన్నారి ఒక పైపును పట్టుకొని 6 గంటలు తీవ్రంగా శ్రమించింది. ఎంత అరిచినా ఎవరు లేరు. తన తెలివితేటలను ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది.
Gaitami Bridge in Rajamahendravaram, a girl who saved her life with the spirit of time
Viral News: పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, దారులన్ని అవరోదాలుగా మారినప్పుడు, ప్రమాదం కళ్లముందున్నప్పుడు మనల్ని కాపాడేది సమయ స్పూర్తి మాత్రమే. ఇలా తెలివిగా ఆలోచించి తన ప్రాణాలను కాపాడుకుంది ఓ చిన్నారి. పైన అంత చీకటి కిందేమో..కింద ఉద్ధృతంగా ప్రవహించే గోదారి(Godavari). మరోవైపు అప్పటి వరకూ తనతో ఆనందంగా ఉన్న తల్లి, చెల్లి కళ్లముందే అదే నదిలో పడి కొట్టుకుపోయారు. వినడానికే భయానకంగా ఉన్న ఈ పరిస్థితితో 13 ఏళ్ల బాలిక ఎంతో ధైర్యం చూపింది. తల్లిని నమ్మించిన వ్యక్తే కళ్లముందు గోదాట్లో తోసేయగా ఆ చిన్నారి సమయస్ఫూర్తితో తన ప్రాణాలు కాపాడుకుంది. ఇలాంటి సమయంలో తన తెలివితేటలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుప్పాల సుహాసిని(36) భర్తతో విభేదాలతో విడిపోయి, తన కూతురితో కూలిపని చేసుకుంటూ జీవితం సాగిస్తోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. వీరికి ఒక పాప పుట్టింది పేరు జెర్సీ(ఏడాది). ఇటీవల సురేష్, సుహాసిని మధ్య విభేదాలు వచ్చాయి. దీని కారణంగా ఆమెను, పిల్లలను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సురేష్ కుట్ర పన్నాడు.
చదవండి:Viral News: నేను శివున్ని..మళ్లీ బతికిస్తా అంటూ కొట్టి చంపాడు
వారిని రాజమహేంద్రవరం(Rajamahendravaram)లో దుస్తులు కొందామంటూ శనివారం సాయంత్రం ముగ్గురిని తీసుకొని కారులో బయలుదేరాడు. రాత్రంతా వివిధ ప్రాంతాల్లో తిప్పి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రావులపాలెంలోని గౌతమి పాత వంతెనవద్దకు వారిని తీసుకొచ్చాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి పిల్లలతో సహా రెయిలింగ్ వద్ద పిట్టగోడపై నిలబెట్టాడు. తర్వాత ఒక్కసారిగా వారందరినీ నదిలోకి తోసేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో సుహాసిని, జెర్సీ నదిలో పడిపోయారు. కీర్తనకు వంతెన పక్కగా వేసిన కేబుల్ పైపు చేతికి అందడంతో దానికి గట్టిగా పట్టుకుంది. ఒక చేత్తో పైపును పట్టుకొని వేలాడుతూనే ఎవరైనా రక్షిస్తారేమో అని గట్టిగా కేకలు వేసింది.
నదీ ప్రాంతం అందులో ఆ సమయంలో అక్కవ ఎవరు లేరు. పైగా చుట్టు చీకటి, కింద గోదావర హోరు. ఇంతలో తన జేబులో మొబైల్ ఫోన్ ఉన్న విషయం గుర్తుకొచ్చింది. ఒకచేత్తో పైపు పట్టుకుని వేలాడుతూనే మెల్లగా మరో చేత్తో ఫోన్ బయటకు తీసింది. ఏ మాత్రం తేడా వచ్చిన తను కింద పడుతుంది. లేదా ఫోన్ అన్న కిందపడుతుంది. ప్రాణాలు బిగవట్టి సాహాసం చేసింది. 100 నంబరుకు కాల్ చేసి తానున్న పరిస్థితిని తెలిపింది. వెంటనే రావులపాలెం ఎస్.ఐ.వెంకటరమణ సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని బాలికను రక్షించారు. సుమారు అరగంటపాటు చీకట్లో ఆమె పైపు ఆధారంతో వేలాడుతూ ఉండడమే కాక ఫోన్ చేసి తమకు చెప్పిన వైనాన్ని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. తన ధైర్యాన్ని, తెగువను అభినందించారు. గోదావరిలో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. అలాగే పారారిలో ఉన్న సురేష్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు సీఐ రజనీకుమార్ తెలిపారు. చిన్నారిని రక్షించిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు.