»Amarnath Yatra To Begin On July 1 Registrations From April 17 Details Here
Amarnath Yatra:జులై 1వ తేదీ నుంచి అమర్ నాథ్ యాత్ర
అమర్నాథ్ ఆలయ యాత్ర(Amarnath Yatra) జులై 1వ తేదీ నుంచి ప్రారంభమై 62 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు మోడ్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
Amaranath Yatra: ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) కు సంబంధించిన తేదీలను శుక్రవారం వెల్లడించారు. హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ యాత్ర జులై 1వ తేదీ నుంచి ప్రారంభమై 62 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు మోడ్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. యాత్ర పూర్తి వివరాలకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మనోజ్ సిన్హా సూచించారు.
యాత్రలో యాత్రికులు, సర్వీస్ ప్రొవైడర్లకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని సిన్హా హామీ ఇచ్చారు. యాత్ర మార్గంలో వైద్య సదుపాయాలు, టెలీకాం సేవలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. యాత్ర ప్రారంభం కావడానికి ముందే ఆ మార్గంలో టెలీకాం సేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) విజయవంతంగా పూర్తి కావడం కోసం సంబంధిత వర్గాలన్నింటినీ సమన్వయం చేస్తామన్నారు. పోలీస్, విద్యుత్, వసతి, తాగు నీరు, పారిశుద్ధ్యం, భద్రత.. తదితర సేవలను భక్తులు నిరంతరాయంగా పొందేలా చూస్తామని జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు. ఏప్రిల్ 17 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్ లైన్ (online)లో లేదా ఆఫ్ లైన్ (offline)లో రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవచ్చు.
రెండు మార్గాల నుంచి ఈ యాత్ర జరుగుతుంది. ఒకటి అనంత్ నాగ్ (Anantnag) జిల్లాలోని పహల్ గావ్ మార్గం (Pahalgam track) కాగా, మరొకటి గండేర్ బల్ జిల్లాలోని బల్తాల్ (Baltal) మార్గం. శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డ్ కూడా ఈ సంవత్సరం ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం నిర్వహించే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీ అమర్ నాథ్ యాత్ర యాప్ (Amarnath Yatra app) ను ఆసక్తి కలిగిన భక్తులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా యాత్రకు సంబంధించిన తాజా వివరాలు, వాతావరణ పరిస్థితులు తెలుసుకోవచ్చు.