»A Terrible Road Accident In Rayagad 13 People Died
Road accident : రాయగడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
పూణె(Pune)లోని పింపుల్ గురవ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు (BUS) లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు.
మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా(Raigad District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణె(Pune)లోని పింపుల్ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు (BUS) లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు (police) ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు.
బస్సులో చిక్కున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. రాయగడ్లోని ఖోపోలి ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు రాయగడ్ ఎస్పీ సోమనాథ్ ఘార్గ్ (SP Somnath Gharg) వెల్లడించారు. కర్ణాటక(Karnataka)లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.తుముకూరు జిల్లా హిరాహేళిలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident) లో నలుగురు మృతి చెందారు. ఎస్యూవీ, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుముకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.