spurious liquor:కల్తీ మద్యం (spurious liquor) నిండు జీవితాలను ఛిద్రం చేసింది. ఆ మద్యం (liquor) తాగి ఐదుగురు చనిపోయారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బీహర్లో (bihar) గల మోతిహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. మద్యం సేవించి.. తీవ్ర అస్వస్థతకు గురయిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు.
బీహార్లో (bihar) మద్యపానం నిషేధం అమల్లో ఉంది. నితీశ్ కుమార్ ప్రభుత్వం లిక్కర్ (liquor) విక్రయించడం నిషేధించిన సంగతి తెలిసిందే.. అందుకే కొందరు మద్యం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటారు. అలా తీసుకురాగా అందులో కల్తీ మద్యం (spurious liquor) ఉన్నట్టుంది. దానిని సేవించి కొందర ప్రాణాలు తీసుకున్నారు.. మరికొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.