»Father Hacks Son Mother In Law In For Inter Caste Marriage In Tamilnadu
Tamilnadu:తమిళనాడులో పరువు హత్య.. కొడుకు, అత్త బలి
పెళ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్రగాయాలతో అక్కడే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు.
Tamilnadu: మానవుడు సాంకేతికంగా ఎంత ఎదుగుతున్నా.. అతని ఆలోచనలు మాత్రం మారడం లేదు. ఇప్పటికీ సమాజంలో కులాలు మతాలు అంటూ తన చుట్టూ గిరి గీసుకుని జీవిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడికైనా గంటల్లో వెళ్లి వస్తున్నాం. బతుకు దెరువు నిమిత్తం ఎక్కడ ఉద్యోగం(Job) దొరికినా అక్కడికి వెళ్లి జీవిస్తున్నాం. ఈ క్రమంలోనే విదేశీయులను కూడా పెళ్లి(Marriage) చేసుకుంటున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. అలాంటి సమాజంలో పరువు హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తమకన్నా తక్కువ కులం వారిని వివాహం చేసుకుందని.. కన్నవారిని చంపుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి దారుణ ఘటన ఒకటి తమిళనాడులోని కృష్ణగిరి(Krishnagiri) జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొడుకు బలయ్యాడు. కోడలు త్రుటిలో తప్పించుకుంది. కానీ కోడలి ప్రాణం కాపాడబోయి అత్త ప్రాణాలు పోగొట్టుకుంది. పోలీసులు(Police) తెలిపిన వివరాలు.. దండపాణి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో నివసిస్తున్నాడు. అతని కొడుకు సుభాష్ తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండానే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి దండపాణి(Dandapani)కి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్(Subhash) తీవ్రగాయాలతో అక్కడే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది. దాక్కున్న కోడలిని చంపడానికి యత్నిస్తుండగా దండపాణిని స్థానికులు అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి(Hospital)కి తరలించారు.